సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల ర్యాలీ
ఖమ్మంసహకారనగర్: సమస్యల పరిష్కారం కోసం కొన్నిరోజులుగా సమ్మె చేస్నుత్న సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులు శనివారం ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రం నుండి జెడ్పీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ విగ్రహాని కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్ ఎస్ఏ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ మహబూబ్పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఝాన్సీ సౌజన్య మాట్లాడుతూ టీ తాగేలోగా తమ సమస్యలను పరిష్కరిస్తామన్న సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని అమలుచేయాలని కోరారు. ఈక్రమంలో టీ కప్పుతో కూడిన ప్లకార్డులతో వారు ర్యాలీలో పాల్గొన్నారు. ఉద్యోగులకు టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విజయ్ మద్దతు తెలపగా వీరస్వామి, అనిల్, సాంబశివరావు, ఇస్మాయిల్, విజయనిర్మల, విజయలక్ష్మి, రాణి, కృష్ణప్రసాద్, సురేష్, భగవాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment