ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఇటీవల అంబేద్కర్ చేసిన వాఖ్యల వెనుక మతోన్మాద కుట్ర దాగి ఉందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో భాగంగానే ఆయన వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఈమేరకు సీపీఐ ఆధ్వర్యాన శనివారం ఖమ్మం ఖమ్మం బైపాస్‌రోడ్డులో అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశాక ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని ఏనాడు గౌరవించని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతలు ఇప్పుడు జమిలీ పేరిట నియంత పాలనవైపు అడుగులేస్తున్నారని విమర్శించారు. కాగా, అంబేద్కర్‌పై వ్యాఖ్యల విషయంలో అమిత్‌షాను సమర్ధిస్తున్న ప్రధాని మోడీని కూడా రాజ్యాంగ ద్రోహిగానే పరిగణించవలసి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దండి సురేష్, జమ్ముల జితేందర్‌రెడ్డి, యర్రా బాబు, ఎస్.కే.జానీమియా, కొండపర్తి గోవిందరావు, శింగు నర్సింహారావు, పోటు కళావతి, మహ్మద్ సలాం, తాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment