అటవీ అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు
ఖమ్మంవన్‌టౌన్: అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం అటవీ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అగ్నిప్రమాదాల నివారణకు ఫైర్ వాచర్ల విస్తరణపై దృష్టి సారించాలని తెలిపారు. అలాగే, నిఘా యంత్రాల సాయంతో రానున్న ఎండాకాలంలో మంటలు చెలరేగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇక అటవీశాఖ పరిధిలో భూముల నోటిఫికేషన్ల పురోగతిపై ఆరా తీసిన కలెక్టర్ అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దుల గుర్తింపుపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్, ఆడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, డీపీఓ ఆశాలత, ఆర్‌డీఓ నర్సింహారావు, ఎఫ్‌ఆర్‌ఓలు పి.శ్రీనివాసరావు, బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment