సమగ్రాభివృద్ధికి భవిష్యత్ పోరాటాలు..
సింగరేణి(కొత్తగూడెం): జిల్లా సమగ్ర అభివృద్ధికి భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కానున్నట్లు సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం నూతన జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం స్థానిక మంచికంటిభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈమేరకు రెండు రోజులపాటు ఇల్లెందులో జరిగిన జిల్లా మహాసభలో ప్రజాసమస్యలపై ఆమోదించిన తీర్మానాలను వెల్లడించారు. అంతేకాక మూడేళ్ల కాలంలో పార్టీ ఆధ్వర్యాన సాధించిన విజయాలు సమీక్షించుకుని జిల్లాభివృద్ధికి అవసరమైన పోరాటాల రూపకల్పన చేశామన్నారు. ఇందులో సీతారామ ప్రాజెక్ట్ విషయంలో జిల్లాకు అన్యా యం జరుగుతుందని, జిల్లాభివృద్ధికి నిధులు తీసుకురావడంలో ముగ్గురు మంత్రులు వివక్షత చూపుతున్నారని, జిల్లాలో కొత్త పరిశ్రమలు నెలకొల్పడానికి అవకాశాలు ఉన్నా పట్టించుకోవడం లేదని, ఇందిర మ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్న పట్టించుకోవటం లేదని, పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇచ్చేలా భవిష్యత్ పోరాటాలు నిర్వహిస్తామన్నారు. అంతేకాక వైద్య రంగాన్ని బలోపే తం చేయాలని, వైద్య పోస్టులను భర్తీ చేయాలని, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలకు, సారపాక భద్రాచలం పంచాయతీలకు ఎన్నికలు జరిపి ప్రజా పాలన అందించాలని మహాసభ తీర్మానం చేసిందన్నారు. అలాగే విమానాశ్రయం నిర్మాణం పేపర్లకే పరిమితం కాకుండా ఆచరణలో తేవడానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment