న్యూస్‌రీల్‌ | Sakshi
Sakshi News home page

న్యూస్‌రీల్‌

Published Fri, May 10 2024 4:45 PM

-

నేడు 5కే రన్‌

ఆసిఫాబాద్‌అర్బన్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓ టింగ్‌ శాతం పెంచడంలో భాగంగా ఈ నెల 10న 5కే రన్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే తెలిపారు. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని సిర్పూర్‌, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల్లో ఈ నెల 13న నిర్వహించే ఎన్నికల్లో అధికంగా పోలింగ్‌ శా తం నమోదు చేయడం, ఓటర్లకు అవగాహన కల్పించేందుకు 5కే రన్‌ నిర్వహిస్తున్నట్లు పే ర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం ఉదయం 6 గంటలకు ఈ రన్‌ ప్రారంభమవుతుందని తెలిపారు. జిల్లా అధి కారులు, ఉద్యోగులు, యువకులతోపాటు ప్రతిఒక్కరూ ఇందులో భాగస్వాములై.. విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

15 నుంచి చెస్‌ శిక్షణ శిబిరం

రెబ్బెన(ఆసిఫాబాద్‌): గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 15 నుంచి చెస్‌ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు సామిల్ల సంపత్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్‌, సబ్‌ జూనియర్‌ విభా గంలో బాలబాలికలకు ఉచిత వేసవి శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీ డాకారులు ఈ నెల 14లోగా తమ పేర్లను కోచ్‌ అంబాల కల్పన వద్ద నమోదు చేసుకో వాలని కోరారు. వివరాలకు 8978 14656 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement