‘సున్నా’ లేకుండా గణితం లేదు. లెక్కలేని జీవితం లేనే లేదు. లెక్కించడం ప్రారంభమైనప్పటి నుంచే మానవ నాగరికత మొదలైంది. అలా లెక్కించే దానికి అంకెలు అవసర మయ్యాయి. అంకెలు సంఖ్యలుగా మారి మానవ జీవితాన్ని మార్చివేశాయి. నిత్యజీవితంలో గణితానికి చాలా అనుబంధం ఉంటుంది. అందుకే పోటీ పరీక్షల్లో అంక గణితానికి ప్రత్యేక స్థానం లభించింది. జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, ఎంఈసీ లాంటి కోర్సులకు డిమాండ్ ఉంటుంది. ఉజ్వల భవిష్యత్తుకు ఇదే తొలిమెట్టు. ఇందులో ప్రతిభ కనబరిచేవారు ఇంజినీర్లు, చార్టెడ్ అకౌంట్, తదితర రంగాల్లో స్థిరపడుతున్నారు.
బాల్యం నుంచే గణిత భావనలు
పిల్లలు బాల్యం నుంచే గణిత భావనలు అలవర్చుకుంటారు. సందర్భానుసారంగా తార్కికంగా ఆలోచించడం, సవాళ్లను ఎదుర్కోవడం నేర్చుకుంటారు. గణితంలో వెనుకబడుతున్న విద్యార్థుల కోసం విద్యాశాఖతో పాటు గణిత ఫోరం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ప్రోత్సహించేందుకే పోటీలు
మ్యాథ్స్‌లో ప్రతిభ కలవారిని ప్రోత్సహించేందుకు పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లోనూ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈనెల 12న జిల్లాస్థాయి పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. నేడు హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నారు.
తమిళనాడు రాష్ట్రం తంజావూరులో గల కుంభకోణంలో కుప్పుస్వామి–కోమలతమ్మల్ దంపతులకు 1987 డిసెంబర్ 22న రామానుజన్ జన్మించారు. పేద కుటుంబంలో పుట్టినప్పటికీ విద్యార్థి దశ నుంచే గణితంలో ప్రావీణ్యం సా ధించారు. 13 ఏళ్ల వయస్సులోనే త్రికోణమితి, జామెట్రీలను సొంతగా నేర్చుకున్నారు. ఈయ న ప్రతిభకు తార్కానమే 1729 (రెండు విధాలు గా, రెండు ఘనాల మొత్తం అతి చిన్న సంఖ్య). దీనినే రామానుజన్ సంఖ్యగా వ్యవహరిస్తారు. ఆధునిక గణితశాస్త్రానికి రామానుజన్ అనేక సేవలందించారు. 33 ఏళ్ల వయస్సులోనే ఆయ న కన్నుమూశారు. అప్పటి నుంచి ఆయన జ్ఞాపకార్థం ఏటా డిసెంబర్ 22న జాతీయ గణిత శా స్త్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ.
Comments
Please login to add a commentAdd a comment