![విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/22/21asb151-340146_mr-1734806995-0.jpg.webp?itok=8NwZP0nQ)
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
వాంకిడి: ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. శనివారం మండల కేంద్రంలో ఒకే భవనంలో కొనసాగుతున్న ఎస్సీ, బీసీ బాలుర వసతిగృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల గదులు, వంట గదిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెనూ పాటిస్తూ నాణ్యమైన భోజనం సకాలంలో అందించాలని సిబ్బందిని ఆదేశించారు. వంటల్లో తాజా కూరగాయలు, నాణ్యతతో కూడిన నిత్యావసర సరుకులు మాత్రమే వాడాలని సూచించారు. నాసిరకం, కాలం చెల్లిన సరుకులు వాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం జెడ్పీహైస్కూ ల్‌ను సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు అదనంగా 10 శౌచాలయాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment