ప్రయోగంపై నిఘా!
ఆసిఫాబాద్‌రూరల్: ప్రాక్టికల్స్‌పై ఇంటర్ బోర్డు ప్ర త్యేక దృష్టి సారించింది. అవకతవకలకు తావు లే కుండా నిఘా నీడలో పరీక్షలు నిర్వహించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని ఇంటర్ బోర్డు ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయనున్నారు. అయితే జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో సరైన వసతులు లేకపోవడంతో సీసీ కెమెరాల ఏర్పాటుపై అనుమానా లు రేకెత్తుతున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లోని సైన్స్ ల్యాబ్‌ల్లో మరమ్మతులు, రసాయనాల కొనుగోలు కో సం ప్రభుత్వం రూ.25వేల చొప్పున మంజూరు చేసినా ఇప్పటికీ అసౌకర్యాల మధ్యే విద్యార్థులు ప్రయోగాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా సైన్స్ ల్యాబ్‌లు కూడా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
జిల్లాలో 48 జూనియర్ కళాశాలలు
జిల్లాలో మొత్తం 48 ఇంటర్మీడియెట్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 11 ప్రభుత్వ కళాశాలలు కాగా, ప్రైవేట్ ఐదు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల కళాశాలలు 32 ఉన్నాయి. దాదాపు 10,739 మంది విద్యార్థులు చదువుకుంటుండగా, ప్రథమ సంవత్సరంలో 5,329, ద్వితీయ సంవత్సరంలో 5,419 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఇంటర్ సెకండియర్‌లో బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు అత్యంత కీలకంగా మారుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 3 నుంచి ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ బోర్డు ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ సైతం విడుదల చేసింది.
జిల్లాలో సాధ్యమేనా..?
సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రయోగ పరీక్షల నిర్వహణకు జిల్లాలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల మండలాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సరైన వసతులు లేవు. ప్రత్యేకంగా సైన్స్ ల్యాబ్‌లు లేక తరగతి గదుల్లోనే నిర్వహిస్తున్నారు. నెట్‌వ ర్క్ సిగ్నల్ సమస్య కూడా వేధిస్తోంది. విద్యుత్ సౌకర్యం కూడా అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో సీసీ కెమెరాలు ఎలా ఏర్పాటు చేస్తారనే ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఒక్కో కళాశాలకు రూ. 25వేలు మంజూరు చేసినా.. ఆ నిధులు సరిపోవని అధ్యాపకులు పేర్కొంటున్నారు.
మరింత పకడ్బందీగా ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్
పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం
ఫిబ్రవరి 3 నుంచి పరీక్షలు ప్రారంభం
జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో ‘నిఘా’ కష్టమనే అభిప్రాయం
వసతుల కల్పనపై దృష్టి సారించని వైనం
నిర్వహణపై ఫిర్యాదులు
ఇంటర్మీడియెట్ ప్రయోగ పరీక్షల నిర్వహణపై కొన్నేళ్లుగా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ము ఖ్యంగా ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో తూతూ మంత్రంగా ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు విద్యార్థులు అసలు ప్రాక్టికల్స్ చేయకున్నా ర్యాంకులే లక్ష్యంగా కళాశాల యాజమాన్యాలు మార్కులు వేస్తున్నారనే అపవాదు సైతం ఉంది. పర్యవేక్షణకు నియమించే ఇన్విజిలేటర్లు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో ప్రైవేట్ కళాశాలల్లో ప్రయోగపరీక్షలు ఇష్టారీతిన సాగుతున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులు ప్రైవేట్ కాలేజీ స్టూడెంట్లతో పోటీ పడలేకపోతున్నారు. కొన్ని కళాశాలల్లో ఏకంగా 90శాతానికి పైగా మార్కులు వేస్తుండటంతో ఇంటర్ బోర్డు ప్రయోగ పరీక్షల నిర్వహణ దృష్టి సారించింది. అవకతవకలను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే పరీక్షల తీరు, ఏ కళాశాలలో ఎంత మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారు.. అనే వివరాలతో ప్రతిరోజూ నివేదిక అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఏర్పాట్లు చేస్తున్నాం
2024– 25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 3 నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు ప్రారంభమవుతాయి. బోర్డు నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సీసీ కెమెరాలు లేని ప్రభుత్వ కళాశాలల్లో ఏర్పాటు చేసేలా చర్యలు ప్రారంభించాం. ప్రైవేట్ కళాశాలలు సైతం నిబంధనలు పాటించాలి.
– కల్యాణి, డీఐఈవో
Comments
Please login to add a commentAdd a comment