పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్‌కు గురువారం వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ డీఎంఈ పరిధిలో ఏరియాస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న కార్మికుల కు బడ్జెట్ రాలేదనే నెపంతో కాంట్రాక్టర్లు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. చట్ట ప్రకారం సెలవులు కూడా అమలు చేయడం లేదన్నారు. జీవో 60 ప్రకారం ప్రతినెలా 6లోగా వేతనాలు చెల్లించాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పిడుగు శంకర్, శ్రీశైలం, గుణవంత్‌రావు, మా రుతి, నీల, కమల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment