న్యూస్‌రీల్
భావితరాలకు సంప్రదాయాలు అందించాలి
తిర్యాణి(ఆసిఫాబాద్): గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించా లని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. మండలంలోని మొహింద గ్రామంలో శుక్రవారం చౌరస్తా బ్యాండ్ సంస్థ నిర్వాహకులు మా భూమి సినిమాలోని పల్లెటూరి పిల్లగాడ పాటను నూతనంగా చిత్రీకరించారు. ఏఎస్పీ మాట్లాడుతూ గోండి భాషతోపాటు ఆదివా సీల ఆచారాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉందని తెలిపారు. అనంతరం గ్రామస్తులకు దుప్ప ట్లు, పిల్లలకు బొమ్మలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లండన్, స్వీడన్‌కు చెందిన సంగీత దర్శకులు బెన్, ఆన్, సినీ గేయ రచయిత అక్కల చంద్రమౌళి, ఎస్సై శ్రీకాంత్, ఎఫ్‌ఆర్‌వోలు సరోజారాణి, శ్రీనివాస్, నాయకులు సిడాం అర్జు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment