జోరుగా కోడి పందేలు
● శివారు ప్రాంతాల్లో పేకాట స్థావరాలు ● సంక్రాంతి పండుగ వేళ విచ్చలవిడిగా నిర్వహణ ● విస్తృతంగా దాడులు నిర్వహించిన పోలీసులు ● జిల్లాలో 42 మందిపై కేసు నమోదు
కౌటాల(ఆసిఫాబాద్): తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని జిల్లాలో సంక్రాంతి పండగ వేళ కోడి పందేలు, పేకాట స్థావరాలు జోరుగా నిర్వహించారు. రూ.లక్షల నగదు చేతులు మారింది. ఆది, సోమ, మంగళవారాల్లో పలుచోట్ల పోలీసులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. సాధారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కోడి పందేలకు క్రేజ్ ఉంటుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ రహస్యంగా పందేలు నిర్వహించారు.
కాగజ్‌నగర్ డివిజన్‌లోనే అధికం..
కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని మండలాల్లో పేకాట జోరుగా సాగుతోంది. పోలీసుల దాడులు నిర్వహిస్తూ కొంతమంది జూదరులు పట్టుబడుతున్నా పరిస్థితి మారడం లేదు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేకపోవడంతో పట్టణాలకే పరిమితమైన ఆట పల్లెలకూ పాకింది. కౌటాల, బెజ్జూర్, చింతలమానెపల్లి, దహెగాం, సిర్పూర్(టి) మండలాల్లో పేకాట జోరుగా ఆడుతున్నారు. ఈ క్రమంలో పేద, మధ్య తరగతి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పండుగ సమయంలో కోళ్ల పందేలు పక్కాప్లాన్‌తో పోలీసులు, జన సంచారం లేని స్థలాల్లో నిర్వహించారు. రెండు గ్రూపులుగా రూ.10 వేల నుంచి రూ.లక్షల్లో పందెం కాశారు. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో పండుగ సమయంలో పందెం కోళ్లను బహిరంగంగా బైక్‌లపైనే తరలించారు. గెలుపొందిన పుంజులతో ఫొటోలో తీసుకుని సోషల్ మీడియాలోనూ పోస్టు చేశారు.
ఏటా ఇదే తంతు..
జిల్లాలో ఏటా పండుగల సమయంలో కోడి పందేలు, పేకాట స్థావరాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా మారింది. ఆడపదడపా దాడులు చేస్తూ పోలీసులు నామమాత్రపు కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కోడి పందేల నిర్వహణపై నిషేధం ఉండగా జంతు హింస నిరోధక చట్టం– 1960 ప్రకారం కేసు నమోదు చేస్తారు. సమాచారం తెలియజేయాలని పోలీసులు కోరుతున్నారు. అయినా సంక్రాంతి సమయంలో విచ్చలవిడిగా దందాలు కొనసాగాయి.
ఇటీవల ఘటనలు
ఈ నెల 4న దహెగాం మండలం ఇట్యాల గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేసి 12 మందిపై కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.35,320 నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
12న వాంకిడి మండలం కనర్‌గాం శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి 8 మందిపై కేసు నమోదు చేశారు. రూ.4,200 నగదు స్వాధీనం చేసుకున్నారు.
12న కాగజ్‌నగర్ మండలం రాస్పెల్లి గ్రామ శివారులో కోడి పందేలు నిర్వహించారు. పోలీసులు దాడి చేసి 10 మందిపై కేసు న మోదు చేశారు. 10 బైక్‌లు, ఆరు సెల్‌ఫోన్లు, నాలుగు కోడి పుంజులు, రూ.3,020 నగదు పట్టుకున్నారు.
14న చింతలమానెపల్లి మండలం రణవెల్లి గ్రామ శివారులో కోడి పందేల స్థావరం నిర్వహించగా ముగ్గురిపై కేసు నమోదైంది. వారి వద్ద నుంచి మూడు బైక్‌లు, రూ.1,550 నగ దు, రెండు కోడి పుంజులు స్వాధీనం చేసుకున్నారు.
14న కౌటాల మండలం జనగాం గ్రామ స మీపంలో కోడి పందేలు నిర్వహించారు. కౌ టాల పోలీసులు దాడి చేసి తొమ్మిది మంది పై కేసు నమోదు చేసి, వారి వద్ద నుంచి మూ డు పందెం పుంజులు, రూ.3,900 నగదు, కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment