బుద్ధుడు, అంబేద్కర్ ఆశయాలు సాధించాలి
వాంకిడి(ఆసిఫాబాద్): గౌతమ బుద్ధుడు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని భారతీయ బౌద్ధ మహాసభ(బీఎస్‌ఐ) రాష్ట్ర అధ్యక్షుడు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గడపలె ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్‌లో శుక్రవారం నిర్వహించిన శ్రామ్‌నేర్ శిబిర్ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మార్చి 1 నుంచి 10 వరకు నిర్వహించే శ్రామ్‌నేర్ శిబిర్(బౌద్ధ ధమ్మ దీక్ష శిబిరం)కు సహకారం అందించనున్నట్లు తెలిపారు. ప్రపంచ శాంతి కోసం బుద్ధుడు, అంబేద్కర్ అవిశ్రాంతంగా కృషి చేశారని, సమాజంలో శాంతి నెలకొన్నప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. అనంతరం బీఎస్‌ఐ నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజ్ఞాకుమార్, నాయకులు అశోక్ మహోల్కర్, వినేష్ ఉప్రే, విజయ్ ఉప్రే, జైరాం, దుర్గం సునీల్, హంసరాజ్, విలాస్, రాజేంద్రప్రసాద్, రోషన్, సంతీప్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment