జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
రెబ్బెన(ఆసిఫాబాద్): మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ నెల 17 నుంచి జరిగే 69వ జూనియర్ నేషనల్ బాల్‌బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికై నట్లు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.నారాయణరెడ్డి తెలిపా రు. రెబ్బెన మండలం గోలేటికి చెందిన షార్ప్ స్టార్ బాల్‌బ్యాడ్మింటన్‌కు చెందిన క్రీడాకారులు బాలుర విభాగంలో పిరిసింగుల సాయి చరణ్, దామెర ప్రేమ్‌కుమార్, బాలికల విభాగంలో తుపాకుల ప్రజ్వల శ్రీ ఎంపికైనట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయికి ఎంపికై న క్రీడాకారులను బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నర్సింగం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్.తిరుపతి, షార్ప్ స్టార్ బాల్‌బ్యాడ్మింటన్ అధ్యక్షుడు మహేందర్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment