‘మానవ సేవే మాధవ సేవ’
ఆసిఫాబాద్‌అర్బన్: మానవ సేవే మాధవ సేవ అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన జగద్గురు నరేంద్ర చార్యాజీ మహరాజ్ పాదుక దర్శన కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఆధ్యాత్మికత అలవర్చుకుని, దైవమార్గంలో నడవాలని సూచించారు. మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం సంస్థ ఆధ్వర్యంలో పేదలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అంతకు ముందు సాయిబాబా ఆలయం నుంచి ప్రధాన కూడళ్ల మీదుగా ప్రేమల గార్డెన్ వరకు శోభాయాత్ర నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు చందనకడ్ బాలాజీ, జిల్లా నిరక్త్ దిలీప్ గైక్వాడ్, పండరి చాప్లే పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment