● జంగుబాయి దర్శనానికి వెళ్తుండగా ఐచర్‌ బోల్తా ● డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ప్రమాదం ● ఒకరు మృతి, 47 మందికి గాయాలు ● మరొకరి పరిస్థితి విషమం ● మాలేపూర్‌ ఘాట్‌ వద్ద ఘటన ● రిమ్స్‌, నార్నూర్‌, ఉట్నూర్‌ ఆస్పత్రులకు క్షతగాత్రుల తరలింపు | - | Sakshi
Sakshi News home page

● జంగుబాయి దర్శనానికి వెళ్తుండగా ఐచర్‌ బోల్తా ● డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ప్రమాదం ● ఒకరు మృతి, 47 మందికి గాయాలు ● మరొకరి పరిస్థితి విషమం ● మాలేపూర్‌ ఘాట్‌ వద్ద ఘటన ● రిమ్స్‌, నార్నూర్‌, ఉట్నూర్‌ ఆస్పత్రులకు క్షతగాత్రుల తరలింపు

Published Mon, Jan 20 2025 1:25 AM | Last Updated on Mon, Jan 20 2025 1:25 AM

● జంగ

● జంగుబాయి దర్శనానికి వెళ్తుండగా ఐచర్‌ బోల్తా ● డ్రైవర్

వారంతా తమ ఇలవేల్పు జంగుబాయి పుణ్యక్షేత్రంలో మొక్కు తీర్చుకుందామని సంతోషంగా బయల్దేరారు. ఐచర్‌లో ప్రయాణిస్తూ ముచ్చట్లలో నిమగ్నమయ్యారు. మరికాసేపట్లో ఆలయానికి చేరుకునే వారే. ఈ క్రమంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం. తేరుకునే లోపే వాహనం బోల్తా పడింది. ఏం జరిగిందో తెలియని పరిస్థితి. అందులో ఉన్నవారు ఒకరిపై ఒకరు పడ్డారు. మరికొంత మంది కింద పడిపోయారు. తీవ్ర గాయాల పాలవడంతో ఆర్థనాదాలు, హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. చాలా మంది కదిలే పరిస్థితి కూడా లేక పోవడంతో ఉన్నచోటే రోధించారు. స్థానికులు గమనించి పోలీసులు, అంబులెన్స్‌లకు సమాచారం అందించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇందులో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. మొక్కు తీర్చకుండానే తిరుగు పయనమవ్వాల్సిన పరిస్థితి.

– ఆదిలాబాద్‌టౌన్‌/నార్నూర్‌/

గుడిహత్నూర్‌/ఉట్నూర్‌రూరల్‌

గుడిహత్నూర్‌ మండలంలోని సూర్యగూడ, ఇంద్రవెల్లి మండలంలోని సాలెవాడకు చెందిన ఆదివా సీలు జంగుబాయిని దర్శించుకోవడానికి ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఐచర్‌లో 70 మంది బయలు దేరారు. సూర్యగూడకు చెందిన మాజీ సర్పంచ్‌ కుమ్ర లింగు దీక్షలో ఉండగా వీరిని కాప్లే జంగుబాయి వద్ద పుణ్యస్నానాలు, దర్శనం కోసం తీసుకెళ్లారు. ఈ క్రమంలో సాయంత్రం 4గంటల సమయంలో నార్నూర్‌ మండలంలోని మాలేపూర్‌ రెండోమూలమలుపు ఘాట్‌ వద్ద వాహనం అదుపు తప్పింది. డ్రైవర్‌ వాహనాన్ని న్యూట్రల్‌ చేయడంతోనే ప్రమాదం సంభవించిందని అందులో ప్రయాణిస్తున్న పలువురు పేర్కొన్నారు. మద్యం మత్తులో వాహనాన్ని అజాగ్రత్తగా నడిపి ఉండవచ్చని మరికొందరు తెలిపారు. ప్రమాదంలో 47 మందికి గాయలవగా ఇందులో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌తో పాటు ఉట్నూర్‌, నార్నూర్‌ ఆస్పత్రులకు తరలించారు. వీరిలో రిమ్స్‌లో చికిత్స పొందుతున్న గుడిహత్నూర్‌ మండలం సూర్యగూడకు చెందిన కుమ్ర మల్కు (60) మృతిచెందాడు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది.

లోయలో పడ్డ వాహనం..

డ్రైవర్‌ అజాగ్రత్తతో పాటు డీజిల్‌ ఆదా చేయాలనే కక్కుర్తితోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మొదటి ఘాట్‌ వద్ద న్యూట్రల్‌ చేయగా, రెండో ఘాట్‌ వద్ద వాహనం వేగంతో ముందుకెళ్లింది. ఆ సమయంలో బ్రేక్‌ వేసినప్పటికీ పడకపోవడంతో డ్రైవర్‌ తన ప్రాణాలు కాపాడుకునేందుకు అందులో నుంచి బయటకు దూకాడు. వాహనం మొదట రోడ్డు పక్కనున్న స్తంభాలను, ఆ తర్వాత చెట్లను ఢీకొట్టింది. మొదటి చెట్టు విరిగిపోగా రెండో చెట్టు వద్ద బోల్తా పడింది. అందులో ఉన్నవారు చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ సంఘటనను చూసి డ్రైవర్‌ అక్కడినుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కొత్తపల్లి, భీంపూర్‌కు చెందిన గ్రామస్తులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు ప్రయత్నించారు. పోలీసులు, 108కు సమాచారం అందించారు. స్వల్ప గాయాలైన వారిని నార్నూర్‌ ఆస్పత్రికి, తీవ్ర గాయాలైన వారిని ఉట్నూర్‌, రిమ్స్‌ ఆస్పత్రులకు తరలించారు. చిన్న పిల్లలకు సైతం స్వల్ప గాయాలయ్యాయి.

క్షతగాత్రులు వీరే..

ప్రమాదంలో ఐదుగురు తీవ్ర గాయాల పాలు కాగా, ఇందులో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వృద్ధులకే ఎక్కువ గాయాలయ్యాయి. ఎక్కువ మందికి కాళ్లు, తల, నడుము భాగాల్లో దెబ్బలు తగిలాయి. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారిలో సూర్యగూడకు చెందిన కుమ్ర రాంబాయి, కుమ్ర భీంరావు, వైజాపూర్‌కు చెందిన మెస్రం నాని, సోయగూడకు చెందిన సోయం జంగుబాయి ఉన్నారు. ఉట్నూర్‌ ఆస్పత్రిలో పూర్ణబాయి, కుమ్ర సీతాబాయి, కుమ్ర పాండు, కుమ్ర ప్రవీణ్‌, జుగాదిరావు, శివకుమార్‌, యాదవ్‌రావు ఉన్నారు. మిగతా వారు నార్నూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలియడంతో రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌ పది మంది వైద్యులు, సిబ్బందితో పాటు స్ట్రెచ్చర్లను అందుబాటులో ఉంచారు. వారికి వైద్య సేవలు అందించారు. సూపరింటెండెంట్‌ అశోక్‌ పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా క్షతగాత్రులను తరలించేందుకు సిరికొండ, ఇంద్రవెల్లి, ముత్నూర్‌, ఉట్నూర్‌, హస్నాపూర్‌, లోకారి(కె), గాదిగూడ, జైనూర్‌ల నుంచి మొత్తం తొమ్మిది 108 అంబులెన్సులు సేవలు అందించాయి. కాగా, ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని సీఐ రహీం పాషా తెలిపారు. డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

సంఘటనపై ఆరా తీసిన ఖానాపూర్‌ ఎమ్మెల్యే..

ఐచర్‌ వాహనం బోల్తా పడ్డ విషయం తెలుసుకున్న ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఫోన్‌ ద్వారా ఉట్నూర్‌ ఆస్పత్రి వైద్యులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని రిమ్స్‌, హైదరాబాద్‌ ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించారు.

మాలేపూర్‌ ఘాట్‌ రెండో మలుపు వద్ద బోల్తా పడిన ఐచర్‌ వాహనం

No comments yet. Be the first to comment!
Add a comment
● జంగుబాయి దర్శనానికి వెళ్తుండగా ఐచర్‌ బోల్తా ● డ్రైవర్1
1/3

● జంగుబాయి దర్శనానికి వెళ్తుండగా ఐచర్‌ బోల్తా ● డ్రైవర్

● జంగుబాయి దర్శనానికి వెళ్తుండగా ఐచర్‌ బోల్తా ● డ్రైవర్2
2/3

● జంగుబాయి దర్శనానికి వెళ్తుండగా ఐచర్‌ బోల్తా ● డ్రైవర్

● జంగుబాయి దర్శనానికి వెళ్తుండగా ఐచర్‌ బోల్తా ● డ్రైవర్3
3/3

● జంగుబాయి దర్శనానికి వెళ్తుండగా ఐచర్‌ బోల్తా ● డ్రైవర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement