‘ప్రజలకు సేవ చేసేందుకే కాంగ్రెస్‌లో చేరాం’
బెజ్జూర్: సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరామని టీపీసీసీ సభ్యుడు అర్షద్ హుస్సేన్, జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి రావి శ్రీనివాస్ ఇంటిముందు కార్యకర్తలను పోగు చేసి ఎమ్మెల్సీ దండే విఠల్‌తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలపై శనివారం అనుచిత వ్యాఖ్య లు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధి సంకల్పంతోనే కాంగ్రెస్‌లో చేరామని, మీలా అధికారం అడ్డుపెట్టుకుని దోచుకోవడానికి కాదన్నారు. పార్టీలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలే గానీ ఇలా రోడ్ల మీదికి వచ్చి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మాజీ జెడ్పీటీసీ పద్రం పుష్పలత, మాజీ ఎంపీపీ సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వర్ధన్, మాజీ సర్పంచ్ ఉమ్మేరి లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment