మానిక్‌పటార్ గ్రామాన్ని తొలగిస్తే ఊరుకోం
● బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
కాగజ్‌నగర్‌రూరల్: టైగర్ రిజర్వు ప్రాంతంగా పరిగణిస్తూ మానిక్‌పటార్ గ్రామాన్ని తొలగిస్తే ఊరుకునేదిలేదని బీఆర్‌ఎస్ నేత డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఆదివారం కాగజ్‌నగర్ మండలంలోని మానిక్‌పటార్ గ్రామాన్ని సందర్శించారు. ఈసందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 70 ఏళ్లుగా నివాసం ఉంటున్న గ్రామస్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడంలేదని, కనీసం పక్కా ఇళ్లు, రోడ్డు సౌకర్యంలేదన్నారు. కనీస మౌళిక సదుపాయాలు కల్పించలేదన్నారు. గోండు వీరుడు కుమురంభీం ఉద్యమకాలం నుంచి ఈ గ్రామం ఉందని, ఇప్పుడు తీసివేస్తే ఇక్కడి ప్రజలు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. కుమురంభీం స్పూర్తితో ప్రజ ల కోసం పోరాడుతామన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ భూములకు పట్టాలిచ్చి రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కనీసం పట్టా భూములకు రుణం కూడా ఇచ్చే పరిస్థితిలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నియోజకవర్గ కన్వీ నర్ లెండుగురె శ్యాంరావు, కో కన్వీనర్ రాంప్రసా ద్, యూత్ కన్వీనర్ రాజు, కాగజ్‌నగర్ మండల క న్వీనర్ ఆవుల రాజ్‌కుమార్, నాయకులు నవీన్, షే క్‌చాంద్, అస్లాం, వాసు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment