క్రీడలతో పాటు చదువులోనూ రాణించాలి
పెంచికల్‌పేట్: విద్యార్థులు క్రీడలతో పాటు చదువులోనూ రాణించాలని ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండలంలోని కమ్మర్‌గాంలో ఐదురోజులుగా నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీల విజేతలకు ఆదివారం బహుమతులు ప్రదానం చేశా రు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనా లకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రా మానికి చెందిన యువకులు గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్సీకి వివరించగా త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన మొర్లిగూడ జట్టుకు ప్రథమ బహుమతి రూ.15వేలతో పాటు ట్రోఫీ, ద్వితీయ బహుమతి కమ్మర్‌గా ం జట్టుకు రూ.10వేలు, షీల్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు సముద్రాల సరిత రాజన్న, టీపీసీసీ సభ్యులు అర్షద్ హుస్సేన్, రాచకొండ కృష్ణ, పాల్గొన్నారు.
నేడు ప్రజావాణి రద్దు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నేడు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రె ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సర్వే కార్యక్రమం కొనసాగుతున్న దృష్ట్యా అధికారులు సర్వే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారని, ఈ కారణంగా సోమవారంనాటి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు.
పశువులు తరలిస్తున్న వాహనం పట్టివేత
వాంకిడి: పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నట్లు ఏఎస్సై పోశెట్టి తెలిపారు. ఆదివారం ఉదయం జాతీయ రహ దారిపై గల సరాండి టోల్‌ప్లాజా వద్ద తని ఖీలు నిర్వహిస్తుండగా ఐచర్ వాహనంలో ఎలాంటి ఆధారాలు లేకుండా 17 ఆవులు, 4 ఎద్దులు, 5 గేదెలు తరలిస్తూ పట్టుబడినట్లు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన శైలాని, భైంసాకు చెందిన సులేమాన్, ఫసి, గోయెగాంకు చెందిన షేక్ అబ్దుల్, ఆసిఫాబాద్‌కు చెందిన షేక్ మోసిన్, కెరమెరికి చెందిన అజ్జును అదుపులోకి తీసుకుని విచారించగా మహారాష్ట్రలోని గోండ్ పిప్పిరి నుంచి నిజమాబాద్‌లోని సటాపుర్ మార్కెట్‌లో విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు ఒప్పుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి పశువులను కాగజ్‌నగర్ గోశాలకు తరలించినట్లు ఏఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment