‘పంచాయతీ’ గుర్తులు ఖరారు
కై లాస్‌నగర్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసినా విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు చేపట్టిన అధికార యంత్రాంగం తాజాగా అభ్యర్థులకు కేటాయించనున్న గుర్తులను ఖరారు చేసింది. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు అభ్యర్థులకు 20 గుర్తులు కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వాటికి అనుగుణంగా జిల్లా స్థాయిలో బ్యాలెట్ పేపర్ల ముద్రణకు అధికారులు చర్యలు చేపట్టారు.
సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు
సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తెలిసిన గుర్తులు కేటాయించారు. సర్పంచ్ బ్యాలెట్ పత్రం గులాబీరంగులో ఉంటుంది.
సర్పంచ్ అభ్యర్థులకు బ్యాట్, బ్యాట్స్‌మెన్, స్టంప్స్, ఉంగరం, కత్తెర, ఫుట్‌బాల్, లేడీ పర్స్, టీవీ రిమో ట్, టూత్‌పేస్ట్, పాన, చెత్తడబ్బా, బ్లాక్‌బోర్డ్, బెండకాయ, కొబ్బరితోట, డైమండ్, బకెట్, డోర్ హ్యాండిల్, టీజల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీలైట్, బ్రష్, పడవ, బిస్కెట్, వేణువు, చైన్, చెప్పులు, గాలిబుడగ లాంటి గుర్తులు ఉంటాయి.
వార్డు అభ్యర్థుల గుర్తులు
వార్డు అభ్యర్థుల బ్యాలెట్ తెలుపు రంగులో ఉంటుంది. గౌను, గ్యాస్‌స్టౌ, స్టూల్, సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటినా, గరాట, మూ కుడు, ఐస్‌క్రీమ్, గాజుగ్లాస్, పోస్టుడబ్బా, కవర్, హాకీ కర్రబంతి, నెట్, కటింగ్ ప్లేయర్, బాక్స్, విద్యుత్ స్తంభం, కేతిరి తదితర గుర్తులుంటాయి.
బ్యాలెట్ల ముద్రణకు సర్వం సిద్ధం
పంచాయతీ ఎన్నికల్లో వినియోగించే బ్యాలెట్ పేప ర్ల ముద్రణను జిల్లా స్థాయిలోనే చేపట్టాలని ఎన్ని కల సంఘం ఆదేశించింది. ఆయా జిల్లాల అధికారులు ఇందుకు కసరత్తు ప్రారంభించారు. బ్యాలెట్‌ల ముద్రణకుఏ ఇప్పటికే ఆయా జిల్లాల ప్రింటింగ్ ప్రెస్‌ల యజమానులు దరఖాస్తు చేసుకోగా, వారికి అధికారులు బాధ్యతలు అప్పగించనున్నారు.
నోటా కూడా..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు నచ్చకుంటే వారిని తిరస్కరించే అవకాశాన్ని ఓటర్లకు ఈసీ కల్పి ంచింది. బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు నోటా గుర్తును బ్యాలెట్ పేపర్‌పై ముద్రించనున్నారు. పోటీలో ఎందరు అభ్యర్థులున్నా వారి గుర్తులతో పాటు అదనంగా నోటాను ముద్రించనున్నారు.
సర్పంచులకు 30.. వార్డు సభ్యులకు 20
‘బ్యాలెట్’ పేపర్ల ముద్రణకు కసరత్తు షురూ
మొదలైన బాక్సుల మరమ్మతులు
Comments
Please login to add a commentAdd a comment