చప్రాడాలో పల్లకిసేవ
బెజ్జూర్: మహారాష్ట్రలోని చప్రాడా ఆధ్యాత్మిక కేంద్రంలో కార్తీక స్వామి పల్లకిసేవ ఆదివా రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక స్వామి సమాధిని సిర్పూ ర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపెల్లి శ్రీనివా్‌స్, సిర్పూర్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్ధన్ దర్శించుకున్నారు. అనంతరం దత్త అవతార్ కార్తీక్ స్వామి బాబా చిత్రపటంతో పల్లకిసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం యూత్ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సతీష్, బీజేపీ నాయకులు భాస్కర్, రాజు, సామల తిరుపతి, మధుకర్, ఉమ్మెర బాలకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు, బెజ్జూర్, కౌటాల, కాగజ్‌నగర్‌కు చెందిన భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment