విజయవాడ స్పోర్ట్స్: కేకే గ్లోబల్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో వారం రోజులుగా జరుగుతున్న వన్డే క్రికెట్ లీగ్ టోర్నీ ముగిసింది. యనమలకుదురులోని కేకే గ్లోబల్ క్రికెట్ మైదానంలో గురువారం హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో అకాడమీ జట్టు ప్రత్యర్థి వెస్ట్ గోదావరి వారియర్స్ జట్టుపై 104 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కై వసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకే గ్లోబల్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 298 పరుగులు చేసింది. బ్యాట్స్‌మెన్‌లు రేవంత్(126), పవన్(119) అద్భుతమైన సెంచరీలతో రాణించడంతో జట్టు భారీ స్కోరు సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో కేకే గ్లోబల్ జట్టు బౌలర్లు వెస్ట్ గోదావరి వారియర్స్ జట్టు బ్యాట్స్‌మెన్‌లను 39.5వ ఓవర్ వద్ద 194 పరుగులకు ఆలౌట్ చేశారు. 119 పరుగులతో పాటు ఒక వికెట్ తీసిన కేకే గ్లోబల్ జట్టు ఆల్‌రౌండర్ పవన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. విజేతలకు తహసీల్దార్ టి.సతీష్, కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ అడహాక్ కమిటీ కన్వీనర్ రవిశంకర్, హై కోర్టు న్యాయవాది సత్యనారాయణ ట్రోఫీలను అందజేశారు.
ఎస్జీటీల సీనియార్టీ
జాబితాలు సిద్ధం
పెడన: ఉమ్మడి కృష్ణా జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ పోస్టులను అర్హులైన సెకండరీ గ్రేడ్ టీచర్లతో భర్తీ చేయనున్నట్లు నోడల్ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి తాహెరాసుల్తానా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఎస్జీటీల జాబితాలను సిద్ధం చేసి ఎంఈఓ కార్యాలయాలకు పంపించామని చెప్పారు. సీనియార్టీ జాబితాల ప్రకారం ఎస్జీటీలు విల్లింగ్, అన్‌విల్లింగ్ ఇవ్వడానికి ఈనెల 27న ఉదయం 10 గంటలకు డీఈఓ కార్యాలయంలో సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావలసిందిగా ఆమె కోరారు.
Comments
Please login to add a commentAdd a comment