దగ్ధమైన గన్నవరం డిపో బస్సు
గన్నవరం: తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు సమీపంలో కృష్ణాజిల్లాలోని గన్నవరం ఆర్టీసీ డిపోనకు చెందిన బస్సును మావోయిస్టులు దహనం చేసిన ఘటన బుధవారం రాత్రి చోటు జరిగింది. గన్నవరం డిపో మేనేజర్ పి.శివాజీ కథనం మేరకు.. గన్నవరం ఆర్టీసీ డిపోనకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ నుంచి మధ్యాహ్నం 1.40 గంటలకు 35 మంది ప్రయాణికులతో గన్నవరం బయలుదే రింది. రాత్రి ఏడు గంటలకు తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఛత్తీస్‌గఢ్‌లోని కొంటాకు 15 కిలోమీటర్ల సమీపంలోకి రాగానే బస్సును మావోయి స్టులు అడ్డుకున్నారు. బస్సులో ప్రయాణికులతో పాటు డ్రైవర్ల సీతారామ్, ఎం.ఎన్.బాబును కిందకు దించివేశారు. బస్సుతో పాటు మరో రెండు లారీలు, కారుపై మావోయిస్టులు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. భయాందోళనకు గురైన డ్రైవర్లు, ప్రయాణికులు ఘటన స్థలానికి ఐదు కిలోమీటర్లు దూరంలో సీఆర్పీఎఫ్ క్యాంప్‌నకు చేరుకున్నారు. సీఆర్పీఎఫ్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో బస్సులోని బాయినెట్, డ్రైవర్ సీటు, డ్యాష్‌బోర్డ్, స్టీరింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ మాత్రమే పాక్షికంగా దగ్ధమన్యాయి. మరమ్మతుల నిమిత్తం బస్సును తిరిగి డిపోనకు తీసుకువచ్చేందుకు సిబ్బందిని పంపినట్లు డీఎం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment