రేపటి నుంచి సీపీఎం జిల్లా మహాసభలు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి సీపీఎం జిల్లా మహాసభలు

Published Sat, Dec 14 2024 1:58 AM | Last Updated on Sat, Dec 14 2024 1:58 AM

-

చల్లపల్లి(అవనిగడ్డ): చల్లపల్లిలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకూ నిర్వహించనున్న కృష్ణా జిల్లా సీపీఎం మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు తెలిపారు. స్థానిక గుంటూరు బాపనయ్య భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 15న చల్లపల్లిలోని అమర వీరుల స్థూపం నుంచి సెంటర్‌ వరకూ భారీ ప్రదర్శన జరుగుతుందన్నారు. సాయంత్రం 4 గంటలకు ఏటీఎం సెంటర్‌లో బహిరంగసభ జరుగుతుందని చెప్పారు. 41 మంది అమరవీరులకు గుర్తుగా ఆయా గ్రామాల నుంచి ప్రభలు, కళాజాతాలతో ప్రదర్శనగా వస్తారని తెలిపారు. 16, 17 తేదీల్లో చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే 200 మంది అతిథలతో సభ జరుగుతుందని చెప్పారు. 15న బహిరంగ సభ జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు శీలం నారాయణరావు, మండల పార్టీ కార్యదర్శి యద్దనపూడి మధు, మహ్మద్‌ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.

రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ మ్యాచ్‌ డ్రా

మంగళగిరి: విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీ అండర్‌ – 16లో రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. నగర పరిధిలోని అమరావతి టౌన్‌షిప్‌లో ఉన్న అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరిగింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 82.1 ఓవర్లలో 266 పరుగులు చేసి ఆలౌటైంది. రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ యశ్వంత్‌ భరద్వాజ్‌ 50 పరుగులు సాధించగా, షైఫన్‌ ఖాన్‌ 48 పరుగులు చేశాడు. ఉత్తరాఖండ్‌ బౌలర్లు నియాన్‌ త్యాగి, మహ్మద్‌ షాహిద్‌లు చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఉత్తరాఖండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 102.5 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌ టైంది. ఉత్తరాఖండ్‌ బ్యాట్స్‌మెన్‌లు అభిమన్యు 75 , అనయనేగి 71, కుషేర్గ జెడ్‌ 54 పరుగులు సాధించారు. రాజస్థాన్‌ బౌలర్లు మిరాన్‌ ఖాన్‌, సుజాల్‌ ఫర్మార్‌ 3 వికెట్ల చొప్పున తీశారు. రాజస్థాన్‌ రెండవ ఇన్నింగ్స్‌లో 65 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 243 పరుగులు సాధించింది. రజత్‌ బాగెల్‌ 86, రాహుల్‌ 81, సైఫన్‌ ఖాన్‌ 51 పరుగులు సాధించారు. దీంతో మ్యాచ్‌ డ్రా అయింది. ఉత్తరాఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించడంతో మూడు పాయింట్లు సాధించింది. రాజస్థాన్‌ ఒక పాయింట్‌ పొందింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement