ఉమ్మడి కృష్ణా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం ఎన్నిక
విజయవాడస్పోర్ట్స్: ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం అధ్యక్ష,కార్యదర్శులుగా బీరం వెంకటరమణ, కొక్కిలిగడ్డ రాంబాబును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ఠాగూర్ మెమోరియల్ గ్రంథాలయంలో శుక్రవారం జరిగిన ఎన్నికలకు అధికారులుగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.కన్నమ్మ, సహాయ కార్యదర్శి హెచ్.శ్రీనివాసులు వ్యవహరించారు. సంఘం గౌరవాధ్యక్షులుగా మధుసూదనరాజు, అసోసియేట్ అధ్యక్షులుగా రామారావు, స్టేట్ డెలిగేటుగా నాగరాజు, కోశాధికారిగా నాగరవి, ఉపాధ్యక్షులుగా షేక్ కాలేషా, సుబ్బారావు, మహిళా అధ్యక్షురాలుగా రమణి, సంయుక్త కార్యదర్శులుగా నాగేశ్వరరావు, విజయకృష్ణ, తదితరులు ఎంపికయ్యారు. నూతన అధ్యక్ష కార్యదర్శులను ఈ సందర్భంగా సభ్యులు సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment