పులకించిన భక్తజనం | - | Sakshi
Sakshi News home page

పులకించిన భక్తజనం

Published Sat, Dec 14 2024 1:59 AM | Last Updated on Sat, Dec 14 2024 1:59 AM

పులకి

పులకించిన భక్తజనం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ భక్తజనానికి దర్శన భాగ్యం కల్పించింది. అమ్మ దర్శనంతో శుక్రవారం భక్తుల మది పులకించింది. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దర్శనానికి భక్తులు, నూతన వధూవరులు, యాత్రికుల తాకిడి పెరిగింది. సుముహూర్తాలతో ఒక్కటైన నూతన వధూవరులు, వారి కుటుంబ సభ్యులతో పాటు శుక్రవారం భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకుంది. ఆది దంపతులకు నిర్వహించిన ఆర్జిత సేవల్లో ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలిరావడంతో ప్రాంగణంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. భవానీలు, అయ్యప్పలు, శివ దీక్షధారణ చేసిన వారితో పాటు యాత్రలు చేసిన వారు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. పవిత్ర కృష్ణా నదిలో పుణ్యస్నానాలు చేసిన ఘాట్‌రోడ్డుతో పాటు మహా మండపం లిప్టు, మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు. సర్వ దర్శనంతో పాటు రూ. 100, రూ.300, రూ.500 టికెట్‌ క్యూలో భక్తుల రద్దీ కనిపించింది. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమర్పించడానికి అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో రద్దీ పెరగడంతో క్యూలు త్వరితగతిన ముందుకు కదిలేలా చర్యలు తీసుకున్నారు. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ, పల్లకీ సేవల్లోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు.

దుర్గమ్మ సన్నిధిలో భక్తుల సందడి నూతన వధూవరులు, యాత్రికుల తాకిడి ఆర్జిత సేవలకు డిమాండ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
పులకించిన భక్తజనం 1
1/1

పులకించిన భక్తజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement