గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
కృష్ణలంక(విజయవాడతూర్పు): బందరు కాలువలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన కృష్ణలంక పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్ అండ్ బీ క్వార్టర్స్ ఎదురుగా బందరు కాలువలో పురుష మృతదేహం ఉన్నట్లు గురువారం రాత్రి 10 గంటల సమయంలో సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీశారు. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించ లేదని, ఎత్తు 5.4 అడుగులు.. వయస్సు 50నుంచి 55 మధ్య ఉండొచ్చని తెలిపారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందని చెప్పారు. ఎరుపు కాఫీ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నా డని, చామనఛాయ రంగు కలిగి రెడ్ కలర్ గడ్డం ఉందని తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment