సమర నినాదమై..
అన్నదాతలకు అండగా వైఎస్సార్ సీపీ శ్రేణులు కదం తొక్కాయి. దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై నిరసన గళం విప్పాయి. కల్లబొల్లి మాటలతో మాయ చేసిన కూటమి పెద్దలను నిగ్గదీసి ప్రశ్నించాయి. రైతు సమస్యలు కనపడకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్న వైనంపై రోడ్డెక్కి నిలదీశాయి. ప్రభుత్వ తీరుతో నష్టపోయిన రైతన్నలు కూడా పెద్ద ఎత్తున పదం కలిపి, కూటమి ప్రభుత్వానికి కళ్లు బైర్లు కమ్మేలా నినదించాయి.
అన్నదాతకు మద్దతుగా వైఎస్సార్ సీపీ పోరుబాటు
జర్నలిస్టులపై దాడి దుర్మార్గం
దళారులకే అమ్మేశా..
నేను ఆరు ఎకరాల వరి సాగు చేశా. వాతావరణ పరిస్థితులు అననుకూలంగా ఉండటంతో కోత యంత్రంతో కోత కోయించా. ప్రభుత్వం బస్తాకు రూ. 1730 మద్దతు ధర ప్రకటించినా అందే పరిస్థితి లేదు. దీంతో దళారికి బస్తా రూ. 1450లకే అమ్మేశా. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను దళారులు ఇవ్వటం లేదు. తప్పని పరిస్థితుల్లో బస్తాకు రూ. 280 నష్టానికి విక్రయించా. క్షేత్ర స్ధాయిలో ఈ సమస్యను తాము ఎదుర్కొంటున్నా.. పాలకులు, అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం విచారకరం.
– అరిగే చంద్రశేఖర్,
మేడూరు, పమిడిముక్కల మండలం
మద్దతు ధర కోసం
నిరీక్షిస్తున్నా..
బస్తా వరి ధాన్యానికి మా ప్రాంతంలో దళారులు రూ. 1370 మాత్రమే ఇస్తున్నారు. పెట్టుబడి వ్యయం పెరిగిపోయినందున ఈ ధర ఏమాత్రం గిట్టుబాటు కాదు. అందువల్లే నా ఎకరం నర పొలాన్ని కోత కోయించాను. మద్దతు ధర వచ్చే వరకూ నిరీక్షించి ధర పలికితేనే విక్రయిస్తా. లేకుంటే సాగుకు పెట్టిన ఖర్చులు కూడా రావు. ఇకపై వ్యవసాయం డబ్బున్నోళ్లే చేయగలుగుతారు.
– చిన్నం కోటేశ్వరరావు,
నిమ్మగడ్డ, చల్లపల్లి మండలం
మంత్రి చెప్పినా దిక్కులేదు..
ఇటీవల మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటనలో మా ధాన్యాన్ని పరిశీలించి దీనిని వంటనే కొనుగోలు చేయాలని అధికారులు చెప్పినా వారు స్పందించలేదు. సాయంత్రానికల్లా కొనుగోలు చేస్తారని మంత్రి చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. ఇంతేకాకుండా ధాన్యం రోడ్లపై ఆరబెట్టుకుంటుంటే జాతీయ రహదారి అధికారులు బెదిరిస్తున్నారు.
– మాడెం నాగరాజు, అవనిగడ్డ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఏ ఒక్క రైతు నుంచైనా మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేశారా అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ శాసనసభ్యుడు కై లే అనిల్‌కుమార్ ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుకు అండగా వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపారు. ప్లకార్డులతో రైతులు పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం ధర్నా చౌక్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకొని ఇన్‌చార్జ్ డీఆర్వో బి. శ్రీదేవికి వినతిపత్రం అందజేసి రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించారు. వైఎస్సార్ సీపీ మచిలీపట్నం నగర కన్వీనర్ షేక్ సలార్‌దాదా, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్‌నాయుడు, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్‌రావు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జోనల్ ఇన్‌చార్జ్ కడవకొల్లు నరసింహారావు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
కైలే అనిల్‌కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. రైతులను ఆదుకుంటామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన పాలకులు రైతులను పట్టించుకోవటం లేదన్నారు. ఏ రోడ్డుపై చూసినా రైతులు ధాన్యం రాశులు పోసుకుని నిరీక్షిస్తున్నారన్నారు. ఈ సంఘటనలపై తాము పోరాటం చేస్తుంటే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా బురదజల్లే కార్యక్రమాలను చేస్తున్నారన్నారు.
అవనిగడ్డ మాజీ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ కృష్ణకు ప్రజల సమస్యలను గుర్తెరిగి, వివిధ పథకాల రూపంలో ప్రజలకు మేలు చేసి అందరి మన్ననలు పొందిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట తాము ఉండటం ఎంతో గర్వకారణమన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో వేల సంఖ్యలో నిషేధిత భూముల్లో ఉన్నవాటికి ఉపశమనం కలిగిస్తే నేడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నెలరోజుల్లోనే వాటిని నిషేధిత భూముల్లోకి చేర్చారన్నారు.
వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఉప్పాల రాము మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో కూడా రైతులకు పెట్టుబడి సహాయం ప్రభుత్వం చేయలేదన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రైతులకు పెట్టుబడి సాయం ఐదు సంవత్సరాల పాటు ఇచ్చి ఆదుకున్నారన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించకపోవటంతో పాటు రైతులను ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అనేక ఇబ్బందులు పెడుతున్నారన్నారు.
నేడు డోకిపర్రుకు సీఎం చంద్రబాబు
గుడ్లవల్లేరు: డోకిపర్రులో భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకునేందుకు శనివారం ఉదయం 11గంటలకు సీఎం నారా చంద్రబాబునాయుడు రానున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం దేవస్థాన నిర్వాహకులు విలేకరులకు తెలిపారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(మెయిల్) అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వెంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.
రేపు కబడ్డీ జిల్లా జట్లు ఎంపిక
విజయవాడ స్పోర్ట్స్: రాష్ట్ర జూనియర్ కబడ్డీ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కృష్ణాజిల్లా బాల, బాలికల జట్లను ఈ నెల 15వ తేదీన పమిడిముక్కల మండలం, తాడింకి జెడ్పీ స్కూల్‌లో ఎంపిక చేస్తున్నట్లు కృష్ణాజిల్లా కబడ్డీ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి పి.రవి తెలిపారు. 2005 జనవరి 12వ తేదీ తర్వాత పుట్టిన 70 కేజీల లోపు బరువు ఉన్న బాలురు, 65 కేజీల లోపు బరువు ఉన్న బాలికలు ఈ పోటీలకు అర్హులన్నారు. ఆసక్తి, ఆర్హత ఉన్న క్రీడాకారులు వారి ఆధార్‌కార్డ్‌తో ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఎంపిక ప్రాంగణానికి చేరుకోవాలని తెలిపారు. జిల్లా జట్టకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు రావులపాలెంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని, మరిన్ని వివరాలకు 97040 63555ను సంప్రదించాలని సూచించారు.
నేడు దుర్గమ్మకు కలశజ్యోతులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం భవానీలు, భక్తులు కలశజ్యోతులను సమర్పించనున్నారు. సత్యనారాయణపురంలోని శ్రీ శివరామకృష్ణ క్షేత్రం నుంచి సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక వాహనంపై ఆదిదంపతులైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు అధిష్టించి ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి తరలిరానున్నారు. ఉత్సవంలో భాగంగా అమ్మవారి దీక్షను స్వీకరించిన భవానీలు, భక్తులు పాల్గొననున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా విజయవాడ రూరల్, గుంటూరు, కృష్ణా జిల్లా నుంచి భవానీలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి జ్యోతులను సమర్పించనున్నారు. కలశజ్యోతుల నేపథ్యంలో కనకదుర్గనగర్, గోశాల, మహా మండపం పరిసరాల్లో దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భవానీలు సమర్పించే జ్యోతులను ఉంచేందుకు కనకదుర్గనగర్‌లో ప్రత్యేకం ప్రదేశాన్ని కేటాయించారు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11 గంటలకు అమ్మవారి దర్శనానికి విచ్చేసే భవానీలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవో రామరావు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయగా, ఆలయ ఇంజినీరింగ్ విభాగం ఆయా పనులు పూర్తి చేసింది.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ జిల్లా వేముల మండల కేంద్రంలో నీటి సంఘాల ఎన్నికల కవరేజ్‌కు వెళ్లిన జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులపై దాడి చేయడం దుర్మార్గమని, దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి సోమసుందర్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియోషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ డిమండ్ చేశారు. కవరేజ్‌కు వెళ్లిన సాక్షి టీవీ కరస్పాండెంట్ శ్రీనివాసులు, కెమెరామెన్ రాము, సాక్షి పత్రిక రిపోర్టర్ రాజారెడ్డిలపై ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన వారు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరచడం దుర్మార్గమన్నారు. కెమెరాలను, సెల్ ఫోన్లను కూడా లాక్కొని పగులగొట్టారన్నారు. అనంతరం జర్నలిస్టులను పోలీసు స్టేషన్ తీసుకెళ్లారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడి చేసిన వారిపై కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, అలాగే వారిని వెంటనే తగు రక్షణతో పంపాలని ఒక ప్రకటనలో పోలీసులను కోరారు.
● సాక్షి మీడియా ప్రతినిధులపై దాడిని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ విజయవాడ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, దారం వెంకటేశ్వర రావు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కంచల జయరాజ్, దాసరి నాగరాజు, ఐజేయూ కౌన్సిల్ సభ్యుడు షేక్ బాబు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి సంయుక్త ప్రకటనలో ఖండించారు.
● కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని చిన్న, మధ్యతరహా వార్తాపత్రికల సంఘం (స్సామ్నా) ఆందోళన వ్యక్తం చేసింది. పులివెందులలో సాక్షి మీడియా బృందంపై జరిగిన దాడిని ఖండిస్తూ, ఇటువంటి విధానం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లి ధర్మారావు, సీహెచ్ రమణారెడ్డి ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలన్న డిమాండ్‌ను వారు గుర్తు చేశారు.
● మచిలీపట్నంటౌన్: సాక్షి విలేకరులు, వీడియో విలేకరులపై అధికార టీడీపీ నాయకులు దాడికి పాల్పడటం అమానుషమని ఆంఽద్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) కృష్ణాజిల్లా ఉపాధ్యక్షుడు పైడిపాముల అశోక్‌కుమార్ ఖండించారు.
● కోనేరుసెంటర్: విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడటం నిజంగా సిగ్గుమాలిన చర్యేనని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జిల్లా కన్వీనర్ చలమలశెట్టి రమేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజు మంచివాడైతే..
అనేక ఇబ్బందులు..
డైవర్షన్ రాజకీయాలు..
జగన్ హయాంలో ప్రతి గింజా కొనుగోలు చేశారు..
వైఎస్ జగన్ పరిపాలనలో ప్రతి ఒక్క రైతు ప్రతి గింజను కొనుగోలు చేశారు. నేటి కూటమి ప్రభుత్వంలో ధాన్యాన్ని కొనుగోలు చేసే నాథుడే లేడు. ఇటీవల వల్లూరుపాలెంలో ధాన్యం కొనుగోలు చేయక రైతులు ఆందోళన చేస్తే గాని ప్రభుత్వం దిగిరాలేదు. 1262 రకాన్ని రూ. 1250 నుంచి రూ. 1300లకు కొనుగోలు చేస్తున్నారు. – వెంకటేశ్వరరెడ్డి, తోట్లవల్లూరు
నెల రోజుల్లోనే..
జిల్లా కేంద్రంలో రైతులతో
కలిసి కదంతొక్కిన పార్టీ శ్రేణులు
కూటమి సర్కారు నిర్లక్ష్యానికి
నిరసనగా ర్యాలీ, ధర్నా
పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు,
రైతు నాయకులు
ఇన్‌చార్జ్ డీఆర్వో శ్రీదేవికి
వినతిపత్రం సమర్పణ
పెనమలూరు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవభక్తుని చక్రవర్తి మాట్లాడుతూ పాలించే రాజు పెట్టే వాడైతే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు మేలు చేస్తానని చెప్పి ఇప్పుడు విస్మరించటం ఎలా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు.
కారకులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఏపీయూడబ్ల్యూజే డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment