వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చిట్టిబాబుకు స్థానం
గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం గ్రామానికి చెందిన సంగిశెట్టి చిట్టిబాబు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్‌లో స్థానం సాధించారు. స్థానిక రాయ్‌నగర్‌కు చెందిన చిట్టిబాబు ఎంబీఏ వరకు చదివి ప్రస్తుతం విజయవాడలోని మాస్టర్ మైండ్ కళాశాలలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. కంప్యూటర్ కీబోర్డ్‌పై వేగంగా టైపింగ్ చేయడంలో చిట్టిబాబుకు మంచి నైపుణ్యం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి ఆంగ్ల ఆక్షరాలు ఏ నుంచి జడ్ వరకు వేగంగా టైప్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు కావడం తనకు ప్రేరణ కలిగించింది. అయితే చిట్టిబాబు వినూత్నంగా ఆంగ్ల అక్షరాలను ఆల్ఫాబెట్ ఆర్డర్‌లో రివర్స్‌లో వేగంగా టైప్ చేయడంపై సాధన చేశారు. ఈ అక్షర క్రమాన్ని కేవలం రెండు సెకన్ల 65 మిల్లీ సెకన్ల వ్యవధిలో పూర్తిచేసి సదరు వీడియోను యూకేకు చెందిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ సంస్థకు పంపించారు. చిట్టిబాబు ప్రతిభను గుర్తించిన సదరు సంస్థ ఈ ఏడాది నవంబర్ 17న చిట్టిబాబుకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కల్పిస్తూ సర్టిఫికెట్‌ను, మెడల్‌ను పంపించింది.
Comments
Please login to add a commentAdd a comment