అంతరాయం లేని డిజిటల్ సేవలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భవానీ దీక్ష విరమణలకు వచ్చే లక్షలాది భక్తులకు అంతరాయం లేని డిజిటల్ సేవలు అందించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ.. టెలికం నెట్‌వర్క్–ఇంటర్నెట్ సేవల ప్రొవైడర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు జరిగే భవానీ దీక్షల విరమణకు పటిష్ట కమ్యూనికేషన్ ప్రణాళికను అమలుచేస్తున్నామన్నారు. డ్రోన్లు, రకరకరాల యాప్స్, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్.. తదితరాలు పూర్తిస్థాయి ఫలితాలు ఇవ్వాలంటే సమర్థమైన నెట్‌వర్క్ సేవలు అవసరమని పేర్కొన్నారు. సమావేశంలో డీఐపీఆర్‌వో యు.సురేంద్రనాథ్, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్, బీఎస్‌ఎన్‌ఎల్, రిలయన్స్ జియో తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
తప్పిపోయిన చిన్నారుల జాడ కనిపెట్టే సీఎంఎస్
భవానీ దీక్షల విరమణ సమయంలో తప్పిపోయిన చిన్నారుల జాడ కనిపెట్టేందుకు, వారి సమాచారాన్ని తల్లిదండ్రులకు చేరవేయడానికి వీలుగా దుర్గగుడి చైల్డ్ మానిటరింగ్ సిస్టమ్(సీఎంఎస్) అందుబాటులోకి తెచ్చిందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ వ్యవస్థతో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి చిన్నారుల వివరాలను నమోదు చేసి చేతికి క్యూ ఆర్ కోడ్ బ్యాండ్ వేస్తారన్నారు. ఎవరైనా పిల్లలు తప్పిపోతే స్కాన్ చేయగానే పిల్లల పేరు, తల్లిదండ్రుల పేరు, తల్లిదండ్రుల ఫోన్ నంబర్, తల్లిదండ్రులతో ఫోన్ చేయడానికి లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించడానికి ఆప్షన్లు ఉంటాయన్నారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ లక్ష్మీశ సీఎంఎస్ పనితీరును పరిశీలించారు. చేయాల్సిన మార్పులపై అమరావతి సాఫ్ట్‌వేర్ ఇన్నోవేషన్స్ సీఎండీ అనీల్ కుమార్‌కు సూచనలు చేశారు.
సీఎంఎస్‌తో తప్పిపోయిన చిన్నారుల జాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment