విజయవాడ డివిజన్‌కు రెండు ఇంధన అవార్డులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఇంధన పొదుపులో విజయవాడ రైల్వే డివిజన్‌ను రెండు రాష్ట్ర ఇంధన సంరక్షణ అవార్డులు వరించాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సత్యనారాయణపురంలోని ఈటీటీసీ (ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్)కు గోల్డ్, విజయవాడ రైల్వే హాస్పిటల్‌కు సిల్వర్ అవార్డులు వచ్చాయి. నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం జరిగిన ‘ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ –2024’ వేడుకల్లో ఏపీ ఎనర్జీ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్, ఏపీ జెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్‌బాబు చేతుల మీదుగా విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్, ఏడీఆర్‌ఎం, హాస్పిటల్ సీఎంఎస్ ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మక ఇంధన సంరక్షణ అవార్డులు రావటం సంతోషంగా ఉందన్నారు. సౌరశక్తి, ఎల్‌ఈడీల బల్బుల వినియోగంతో డివిజన్‌లో సంవత్సరానికి 21.09 లక్షల విద్యుత్ యూనిట్లను ఆదా చేయడం ద్వారా రూ.2.04 కోట్లు ఆదా చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం కొండా శ్రీనివాసరావు, హాస్పిటల్ సీఎంఎస్ డాక్టర్ సౌరిబాల, సీనియర్ డీఈఈ టి.సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment