ఇళ్లను తొలగిస్తే ఊరుకోం..
కంచికచర్ల : కంచికచర్ల, చెవిటికల్లు రహదారిలో రోడ్డు పక్కన కట్టిన ఇళ్లను తొలగిస్తున్న ఆర్ అండ్ బీ అధికారులను శుక్రవారం ప్రజలు అడ్డుకున్నారు. 60 ఏళ్ల క్రితం కట్టుకుని నివాసముంటున్న ఇళ్లను తొలగిస్తారా అని మహిళలు అధికారులను ప్రశ్నించారు. వాటిని తొలగిస్తే సహించబోమని హెచ్చరించారు తమ ఇళ్లను తొలగించవద్దని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు విన్నవించుకున్నామని దీనిపై ఆమె హామీ ఇచ్చారని మహిళలు తెలిపారు. నివసిస్తున్న ఇళ్లకు ఇంటిపన్ను, నీటిపన్ను, విద్యుత్ బిల్లులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని తమ ఇళ్లను కూల్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దాదాపు 400 కుటుంబాలు ఇళ్లు కట్టుకుని జీవిస్తున్నాయని మా ప్రాణాలైనా ఇస్తాం నివాసాలను తొలగిస్తే మా బతుకులు బుగ్గిపాలవుతాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.
తొలగించబోమని హామీ ఇచ్చిన ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే మాటను ఖాతరు చేయని ఆర్ అండ్ బీ అధికారులు 60 ఏళ్ల నుంచి నివసిస్తున్న ఇళ్లను కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు అడ్డుకున్న ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment