స్కేటర్ జెస్సీరాజ్‌కు కేంద్ర పురస్కారం
విజయవాడస్పోర్ట్స్: అంతర్జాతీయ స్కేటింగ్ వేదికపై అద్భుత ప్రదర్శన ఇచ్చి ప్రపంచ క్రీడా ప్రముఖుల మన్ననలు పొందిన ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన క్రీడాకారిణి మాత్రపు జెస్సీరాజ్‌ను ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్–2025 వరించింది. ఏటా దేశంలోని 25 మంది ప్రతిభావంతులైన చిన్నారులకు కేంద్రం ఈ పురస్కారం అందజేస్తోంది. ఈ ఏడాది క్రీడా విభాగంలో జెస్సీరాజ్‌ను ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం సీ్త్ర, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ నెల 17న విడుదల చేసిన జాబితాలో పేర్కొంది. ఈ నెల 26వ తేదీన ఢిల్లీలోని రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారం ప్రదానం చేస్తారు. విజయవాడ పటమటలోని ఎన్‌ఎస్‌ఎం స్కూల్‌లో జెస్సీ తొమ్మిదో తరగతి చదువుతోంది. స్కేటింగ్‌పై ఆమె చూపుతున్న ఇష్టాన్ని తల్లిదండ్రులు మాత్రపు రాధ, సురేష్ గమనించి కోచ్ సింహాద్రి వద్ద శిక్షణ ఇప్పించారు. తొమ్మిదేళ్ల వయసు నుంచే శిక్షణ తీసుకుంటూ ఇప్పటి వరకు 50 రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పతకాలను సొంతం చేసుకుంది.
26న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు ప్రదానం
Comments
Please login to add a commentAdd a comment