గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం (ఏబీపీ) కింద కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు మండలాల్లో మంచి ఫలితాలు సాధించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఈ విధమైన కార్యాచరణతో పాటు ప్రత్యేక అవసరాలు గల చిన్నారులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం న్యూఢిల్లీ నుంచి నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఆకాంక్షిత జిల్లాలు, బ్లాక్‌లలో పురోగతిపై ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వర్చువల్ సమావేశానికి కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరం నుంచి హాజరయ్యారు. నీతి ఆయోగ్ సీఈవో మంచి ఫలితాలు చూపిన బ్లాకులను అభినందిస్తూ రివార్డు మొత్తాన్ని త్వరలో అందజేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సీపీవో వై.శ్రీలత, ఇబ్రహీంపట్నం ఎంపీడీవో సునీత శర్మ, ఇబ్రహీంపట్నం బ్లాక్ కోఆర్డినేటర్ పి.శ్రీనివాస్, పెనుగంచిప్రోలు బ్లాక్ కోఆర్డినేటర్ మోహన్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment