నాడు విద్య ఓ వైభవం.. నేడు ఓ ప్రహసనం
‘మన పిల్లలు.. గ్లోబల్ స్టూడెంట్స్’ అని గర్వంగా చెప్పుకొనే స్థాయికి ప్రభుత్వ విద్యను తీసుకెళ్లారు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. నర్సరీ నుంచి డిగ్రీ, పీజీ వరకూ అత్యుత్తమ విద్యా ప్రమాణాలకు నాంది పలుకుతూ.. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. తీసుకున్న ప్రతి నిర్ణయం పేదోడికి మేలు చేకూర్చింది. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈ, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఐబీ సిలబస్, టోఫెల్ ఇలా ఒకటేమిటి అధికారంలో ఉన్నన్నాళ్లూ సంస్కరణల పథాన ముందుకు సాగారు. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో నాటి నవశకం కాస్త.. నేడు అదోరకం అన్నట్లుగా తయారైంది. ఫలితంగా పేద విద్యార్థుల జీవితాలు అంధకారమయమవుతున్నాయి.
● ప్రభుత్వ విద్యను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ● పేద విద్యార్థులకు అండగా నిలిచిన అమ్మ ఒడి, విద్యా, వసతి దీవెన ● ‘నాడు–నేడు’తో విద్యాసంస్థల రూపురేఖలు మార్చిన మాజీ సీఎం జగన్ ● గోరుముద్దతో పౌష్టికాహారం, పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు ● జగన్ జన్మదినోత్సవం అంటే పేద విద్యార్థులకు గుర్తొచ్చేవి ట్యాబ్‌లే
సాక్షి, మచిలీపట్నం: ఉన్నత చదువు అందాలంటే.. నాణ్యమైన విద్య అందాలి. వాటిని అందుకోవడం డబ్బున్న వారికి చాలా సులువే కానీ.. రెక్కాడితే కాని డొక్కాడని పేదలకు మాత్రం అందని ద్రాక్షే. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో చదువు చెప్పించే స్తోమత లేక.. ప్రభుత్వ బడులకు పంపుతుంటారు. అక్కడ సరైన సౌకర్యాలు లేక, విద్యా ప్రమాణాలు లేక ఇబ్బందులు పడేవారు. వీరిలో కొంతమంది స్కూల్ నుంచి కళాశాలలకు వెళ్లేవారు. మిగిలిన వారిలో చాలా మంది మధ్యలోనే చదువును ఆపేసి.. తోచిన పనులు చేసుకునే వారు. ఈ విధానం మారాలని, ప్రభుత్వం విద్యా సంస్థలు మెరుగుపడాలని, తగిన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థి సంఘాల నాయకులతో పాటు ఉపాధ్యాయ సంఘాలు సైతం ఆందోళన చేసిన రోజులు అనేకం. కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం జగన్ ప్రభుత్వ విద్యా సంస్థల రూపురేఖలు మార్చారు. ఎన్నో సంస్కరణలు తెచ్చారు. విద్యార్థుల ఉన్నత విద్యకు బాటలు వేశారు. అనేక పథకాలతో తల్లిదండ్రులకు ఆర్థిక ఆసరాగా నిలిచారు. విద్యా రంగంలో ఆయన వేసిన అభివృద్ధి మార్క్ 30 ఏళ్లయినా చెరిగిపోనిదిగా మిగిల్చారు.
ఉన్నత విద్య చవివే విద్యార్థులకు ఆర్థిక సహాయం కోసం జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన పథకాలు తెచ్చి, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు అందించారు. జగనన్న వసతి దీవెన కింద 96,849 మందికి రూ.112.08కోట్లు, విద్యా దీవెన కింద 1,68,196 మందికి రూ354.66కోట్లు, విదేశీ విద్యా దీవెన కింద 24 మందికి రూ.2.59కోట్లు, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం కింద 106 మందికి రూ.కోటి అందించారు.
విద్యా రంగానికి ‘కూటమి’ తూట్లు..
ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యా రంగానికి తూట్లు పొడుస్తోంది. నాడు మాజీ సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన ఏ పథకాన్ని అమలు చేయకుండా ఆపేసింది. పైగా తల్లికి వందనం కింద రూ.15 వేలు.. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి అందజేస్తానని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా అమల్లో పెట్టలేదు. పైగా విద్యార్థులు ఫీజుల, స్కాలర్‌షిప్‌లు, హాస్టల్ మెస్ బిల్లులు, కాస్మటిక్ చార్జీలు మంజూరు చేయడం లేదు. నాడు నేడు పథకంతో పాటు ఇతర అభివృద్ధి పనులను ఆపేసింది.
‘దీవెన’తో భవిత దేదీప్యం..
ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి పేరు కాకి సౌమ్య. మొవ్వ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. గత ఏడాది 8వ తరగతిలో ఉండగా డిసెంబర్ 21వ తేదీన ప్రభుత్వం నుంచి ట్యాబ్ అందుకుంది. అందులోని విద్యా యాప్‌లు, బై జూస్ కంటెంట్‌తో పాటు చదువులో వచ్చే సందేహాలను అందులో నివృత్తి చేసుకుంటూ వస్తోంది. తన ప్రతిభను మెరుగుపర్చుకుంటోంది. తాను కలలో కూడా సాంకేతిక విద్యా ఈ వయస్సు నుంచే అలవర్చుకుంటానని అనుకోలేదని, ఇది తన జగన్ మామయ్య అందించిన సాంకేతిక విజ్ఞానం వల్లనే సాధ్యమైందని చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment