గుణదల(విజయవాడ తూర్పు): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవీప్రసాద్ అన్నారు. గురునానక్ కాలనీలోని జేఏసీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవి ప్రసాద్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు, నూతన సంస్కరణలపై చర్చించే పార్లమెంటు వేదికగా అంబేడ్కర్‌ను కించపరచడాన్ని తీవ్రంగా ఖండించారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గ్రామ, మండల, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయని పేర్కొన్నారు. తమ వంతు బాధ్యతగా అన్ని జిల్లాల మాల సంఘాల నాయకులు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేస్తారని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరంలోని అంబేడ్కర్ సామాజిక న్యాయ శిల్పం ప్రాంగణంలో వ్యాపార కేంద్రాలు నెలకొల్పడానికి ప్రభుత్వం అనుమతులిస్తుండాన్ని తప్పుబట్టారు. ఈ సమావేశంలో గుర్రం రామారావు, మంగరాజు, బేతాల శరత్ బాబు, జయరాజు తదితరులు పాల్గొన్నారు.
మాల సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment