గుడ్లవల్లేరు: రంగోత్సవ్ పేరిట జిల్లా స్థాయి పోటీలను సంప్రదాయ జానపద పోటీలను మంగళవారం అంగలూరులోని ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ(డైట్)లో నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ జె.మోహినీకుమారి ఆదివారం తెలిపారు. జిల్లాలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ, మునిసిపల్, ఎయిడెడ్ పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజీలే గాక ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి కూడా 6వ తరగతి నుంచి 12వ తరగతులు చదువుతున్న బాల బాలికలు అందరూ ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని చెప్పారు. క్విజ్, ముగ్గుల పోటీలు, డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్, జానపద నృత్యం, స్లోగన్ రైటింగ్, రోల్ ప్లే, డిజిటల్ కోలీజ్ అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి విభాగంలో ప్రథమ బహుమతి పొందినవారు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హులని చెప్పారు. అవసరమైన సామగ్రిని వారే తెచ్చుకోవాలన్నారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు రంగోత్సవ్ నోడల్ ఆఫీసర్, డైట్ అధ్యాపకురాలు ఎస్.జయశ్రీ(83282 14217), లేదా జిల్లా విద్యా శిక్షణా సంస్థ మెయిల్‌కు కూడా పంపవచ్చునని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment