ముగిసిన కథానాటికల పోటీలు
విజయవాడ కల్చరల్: విద్యావాచస్పతి ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు అని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం అన్నారు. అభో విభో కందాళం, జాషువా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ కథా నాటికల పోటీలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు కార్యక్రమంలో భాగంగా ఆచార్య తంగిరాల సుబ్బారావుకు ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం, లక్ష రూపాయల నగదు బహుమతిని అభో విభో వ్యవస్థాపకుడు అప్పాజోస్యుల సత్యనారాయణ, డీఎస్‌ఎన్ మూర్తి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య బేతవోలు రామబ్రహ్మం మాట్లాడుతూ విద్యారంగానికి తంగిరాల చేసిన సేవలు నిరుపమానమైనవని తెలిపారు. ఆధ్యాత్మికవేత్త మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మాట్లాడుతూ బెంగళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఏర్పాటుకు విశేషమైన కృషి చేసినట్లు తెలిపారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్, సాహితీవేత్త రెంటాల శ్రీనివాసరావు, అమరావతి బాలోత్సవ్ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి కొండలరావు ప్రసంగించారు. నాటిక పోటీ విజేతలకు బహుమతులను అందజేశారు.
ఆచార్య తంగిరాలకు ప్రతిభామూర్తి
జీవితకాల సాధన పురస్కారం
Comments
Please login to add a commentAdd a comment