జనసంద్రమైన కేసరపల్లి
గన్నవరం మండలం కేసరపల్లిలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన హైందవ శంఖారావం బహిరంగ సభకు లక్షలాదిగా హిందువులు తరలివచ్చారు. దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన అశేష జన వాహినితో సభ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ పూర్తిగా కాషాయమయమయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రత్యేక రైళ్లకు కంకిపాడు మండలం ఉపలూరు వద్ద హాల్ట్ కల్పించారు. దేశ వ్యాప్తంగా 150 మందికిపైగా పీఠాధిపతులు, విశ్వ హిందూ పరిషత్ అగ్రనేతలు ఈ సభకు హాజరయ్యారు. పోలీసులు చేపట్టిన ట్రాఫిక్ మళ్లింపులతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. – గన్నవరం
Comments
Please login to add a commentAdd a comment