విద్యార్థులు అద్భుతాలు సృష్టించాలి
పెనమలూరు: విద్యార్థులు సృజనాత్మకమైన ఆలోచనలతో వినూత్నమైన అద్భుతాలు సృష్టించవచ్చని సీబీఎస్‌ఈ ప్రాంతీయ అధికారి సువేందు శేఖర్‌దాస్ అన్నారు. కానూ రు కేసీపీ సిద్ధార్థ ఆదర్శ రెసిడెన్షియల్ పాఠశాలలో శుక్రవారం సృజన–2025 కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రతి విద్యా ర్థిలో అమితమైన సామర్థ్యం ఉంటుందని, ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందన్నారు. మొత్తం 350 మంది విద్యార్థులు వారు రూపొందించిన కళాఖండాలు ప్రదర్శించి అందరిని ఆకట్టుకున్నారు. ఆర్ట్ విభాగంలో 144 చిత్రాలు, క్రాఫ్టు విభాగంలో 120, ఎంబ్రాయిడరీలో 90 కళాఖండాలు ప్రదర్శించారు. సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శులు సూరెడ్డి విష్ణు, నిమ్మగడ్డ లలితప్రసాద్, ఉపాధ్యక్షుడు వెల్లంకి నాగ భూషణరావు, కన్వీనర్ వీరపనేని శశికళ, ప్రిన్సిపాల్ మనోజ్ కర్మాకర్ పాల్గొన్నారు.
ఢిల్లీ గణతంత్ర వేడుకకు
గుడివాడ విద్యార్థిని
గుడివాడటౌన్: ఢిల్లీలో ఈనెల 26వ తేదీన జరిగే 76వ గణతంత్ర వేడుకల పరేడ్‌కు గుడివాడ టంగుటూరి ప్రకాశం మున్సిపల్ బాలికల పాఠశాల 9వ తరగతి విద్యార్థిని గోపిశెట్టి సిరి(ఎన్‌సీసీ స్టూడెంట్) ఎంపికై నట్లు డీవైఈవో పద్మరాణి శుక్రవారం తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ డైరెక్టరేట్ జూనియర్ వింగ్ నుంచి సిరి ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు. ఎన్‌సీసీ ట్రూప్‌లో 4వ ఆంధ్ర గరల్స్ బెటాలియన్‌లో సిరి పేరు నమోదు చేసుకోవడం, జూలై నెలలో జరిగిన రిపబ్లిక్ పరేడ్ సెలక్షన్‌లో సిరి పాల్గొని అర్హత సాధించిందని తెలిపారు. మూడు నెలల పాటు గణతంత్ర క్యాంప్‌లో శిక్షణ తీసుకుని గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు సిద్ధమైందని తెలిపారు. సిరిని పాఠశాల ఎన్‌సీసీ అసోసియేట్ అధికారి అనురాధ, 4వ ఆంధ్ర గరల్స్ బెటాలియన్ ఎన్‌సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బలేంధర్‌సింగ్, పాఠశాల హెచ్‌ఎం ప్రమీలరాణి అభినందించారు.
చేనేత, కలంకారీ
పరిశ్రమల పరిశీలన
పెడన: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న చైన్నెలోని హ్యాండ్లూమ్ ఎక్స్‌పోర్టు ప్రమోషన్(హెచ్‌ఈపీసీ) కౌన్సిల్ బృందం శుక్రవారం పెడనలో పర్యటించింది. చేనేత కార్మికుల ద్వారా ఉత్పత్తి జరుగుతున్న అన్ని రకాల చేనేత వస్త్రాలు విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా వీరు పెడనకు విచ్చేసినట్లు చేనేత జౌళి శాఖ ఏడీ సాయిప్రసాద్ తెలిపారు. పలు సంఘాల్లో ఉత్పత్తి జరుగుతున్న చేనేత వస్త్రాలను, కలంకారీ బ్లాక్ ప్రింట్ వస్త్రాలను పరిశీలించారు. హెచ్‌ఈపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్, జాయింట్ డైరెక్టర్ ఎం. సుందర్, చేనేత జౌళి శాఖ సంయుక్త సంచాలకులు కె. కన్నబాబు, ఉప సంచాలకులు బి. నాగేశ్వరరావు, ఆప్కో మేనేజింగ్ డైరెక్టర్ పావన మూర్తి తదితరులు పాల్గొన్నారు.
లింగ వివక్ష రహిత సమాజాన్ని స్థాపించాలి
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): లింగ వివక్ష రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్, మహిళా శిశు సంక్షేమ శాఖ భాగస్వామ్యంతో జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ ‘బాలికలు బంగారం–వారి బాల్యం కాపాడటం మనందరి బాధ్యత’ శీర్షికతో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. బాలల హక్కుల రాష్ట్ర కమిషన్ సభ్యుడు డాక్టర్ జె. రాజేంద్ర ప్రసాద్, ఐసీడీఎస్ నోడల్ అధికారి సాయిగీత, సీఆర్‌ఏఎఫ్ డైరెక్టర్ డాక్టర్ పి. ఫ్రాన్సిస్ తంబి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment