![రేపటి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07vig411-608410_mr-1738981009-0.jpg.webp?itok=pm5hLzyC)
రేపటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
ఉత్సవ కాంతులతో మెరిసిపోతున్న గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం
గుణదల(విజయవాడ తూర్పు): గుణదల మేరీమాత ఉత్సవాలు ఈ ఏడాది కూడా వైభవంగా నిర్వహించనున్నట్లు విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు తెలిపారు. గుణదలలోని సోషల్ సర్వీస్ సెంటర్‌లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నల్గొండ పీఠాధిపతులు డాక్టర్ కరణం దమన్‌కుమార్, ఖమ్మం పీఠాధిపతులు డాక్టర్ సగిలి ప్రకాష్, కర్నూలు పీఠాధిపతులు డాక్టర్ గోరంట్ల జ్వాన్నేసు తదితర గురువులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. ఈ ఉత్సవాలకు సుమారు పది లక్షల మంది యాత్రికులు హాజరు కావచ్చని అంచనా వేశారు. మేరీమాత పుణ్యక్షేత్రం నూరు వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో బసిలికా హోదాకు అనుగుణంగా పుణ్యక్షేత్ర ఆవరణలో నూతన చర్చి నిర్మాణం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
దీవెనకరంగా..
మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్ మాట్లాడుతూ మేరీమాత పుణ్యక్షేత్రంలో జరగబోయే ఉత్సవాలు ప్రజలందరికీ దీవెనకరంగా జరగాలని కాంక్షించారు. పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు మాట్లాడుతూ మేరీమాత ఉత్సవాలకు సంబంధించి సకల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు, వీఎంసీ తదితర ప్రభుత్వ శాఖల అధికారులతో కలసి సమర్థంగా తిరునాళ్లను జరుపనున్నట్లు వివరించారు. అనంతరం ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించినబిషప్ జోసఫ్ రాజారావు
![రేపటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు 1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07vig401-608410_mr-1738981009-1.jpg)
రేపటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment