![నేటి నుంచి మహిళా ఉత్సవ్–2025](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07vie32a-310150_mr-1738981011-0.jpg.webp?itok=xExOuwc6)
నేటి నుంచి మహిళా ఉత్సవ్–2025
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మహిళలు స్వయంగా తయారు చేసిన వివిధ ఉత్పత్తులను వారే స్వయంగా విక్రయించుకునేందుకు ఏర్పాటు చేసిన మహిళా ఉత్సవ్–2025 శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ వరకు మహిళా ఉత్సవ్ నిర్వహించనున్నారు. మొగల్రాజపురంలోని మధుచౌక్‌లో ఉన్న మొగల్ ఎగ్జిబిషన్ హాలులో ఈ మహిళా ఉత్సవ్‌ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వశాఖ రీజనల్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఎస్.శ్రీనివాసరావు హాజరై మహిళా ఉత్సవ్‌ను శనివారం ప్రారంభించనున్నారు. మహిళలు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులతో 50 స్టాల్స్ ఏర్పాటు చేశారు. వివిధ ఉత్పత్తుల ప్రదర్శనతో పాటుగా మహిళలకు జ్యూస్‌లు తయారు చేయడం, మెహందీ పోటీలు, హెయిర్ స్టైల్ పోటీలు, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ శారీస్ ప్రదర్శన పోటీలు, బ్లాక్ ప్రింటింగ్ శారీస్ ప్రదర్శన పోటీలు, సంప్రదాయ పిండి వంటల పోటీలు, మహిళా పారిశ్రామిక వేత్తలకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ మహిళా ఉత్సవ్ జరుగుతుందని జనశిక్షణ సంస్థాన్ చైర్‌పర్సన్ నాగళ్ల విద్యాకన్నా, డైరెక్టర్ ఏ.పూర్ణిమ తెలిపారు.
మొగల్రాజపురం మొగల్ ఎగ్జిబిషన్ హాలులో 50 స్టాల్స్ ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment