సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి
కర్నూలు (టౌన్): రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగి పోతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సూచించారు. గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కర్నూలు జ్యువెలరీ షాపులు, షాపింగ్ మాల్స్, లాడ్జీల యాజమాన్యాలతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా సైబర్ మోసాల బారిన పడితే వెంటనే 1930కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. డిజిటల్ అరెస్టులు ఉండవని, అలాంటి వాటిని నమ్మ వద్దని సూచించారు. షాపింగ్ మాల్స్, జ్యువెలరీ, లాడ్జీల ముందు మన్నిక కలిగిన సీసీ కెమెరాలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాకు త్వరలో 100 ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయన్నారు. తద్వారా కర్నూలు పట్టణంలో ట్రాఫిక్ సమస్య పూర్తిగా తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో సీఐలు ప్రసాద్, కేశవరెడ్డి, అబ్దుల్ గౌస్, మన్సురుద్దీన్, శివశంకర్, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐలు ఖాజవలి, వ్యాపారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment