ఇద్దరు నిందితుల అరెస్ట్
కోడుమూరు రూరల్: వివాహ వేడుకలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి నిండు ప్రాణాలు కోల్పోయేందుకు కారకులైన ఇద్దరిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ తబ్రేజ్ తెలిపిన వివరాలు.. ఈనెల 14న సుందరయ్య నగర్‌లో ఓ వివాహ వేడుక జరుగుతుండగా సురేంద్ర, జంబులయ్య మద్యం మత్తులో మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. అక్కడే ఉన్న దేవేంద్ర, మధుబాబు(25).. సురేంద్ర, జంబులయ్యను వారించి అక్కడి నుంచి పంపించేందుకు యత్నించారు. కాగా మద్యం మత్తులో ఉన్న సురేంద్ర, జంబులయ్య మధుబాబుపై రాయితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కుటుంబ సభ్యులు మధుబాబును చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ కోలుకోలేక ఈనెల 17న మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment