ఏకగ్రీవంగా సాగునీటి ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు
కర్నూలు (సిటీ): జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు శనివారం ఏకగ్రీవంగా జరిగాయి. కర్నూలు సర్కిల్ కార్యాలయంలో జరిగిన ఈ ఎన్నికల్లో తుంగభద్ర దిగువ కాలువ, గాజులదిన్నె ప్రాజెక్టు కమిటీలకు నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈనెల 14వ తేదీన ప్రాదేశిక నియోజకవర్గాలకు, నీటి వినియోగదారుల సంఘాలకు, 17వ తేదీన డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఎన్నికలు నిర్వహించారు. జిల్లాలో తుంగభద్ర దిగువ కాలువ మేజర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా టిప్పు సుల్తాన్, వైస్ చైర్మన్‌గా బావిగడ్డ హుసేన్ సాహెబ్, గాజులదిన్నె ప్రాజెక్టు మీడియం ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా మల్లికార్జున గౌడ్, వైస్ చైర్మన్‌గా కె.చిన్నమద్దయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎల్‌ఎల్‌సీ మేజర్ ప్రాజెక్టు కమిటీని డిస్ట్రిబ్యూటరీ కమిటీలుగా ఎన్నుకోగా ఎన్నికై న వారికి జలవనరుల శాఖ కర్నూలు సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ బాలచంద్రారెడ్డి, తుంగభద్ర దిగువ కాలువ ఈఈ శైలేష్ కుమార్, మీడియం ప్రాజెక్టుగా ఉన్న గాజులదిన్నె ప్రాజెక్టు కమిటీకి ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment