జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన సంబరాలు జిల్లాలో
● జిల్లాలో ఘనంగా మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ● వెల్లివిరిసిన సేవా కార్యక్రమాలు ● రక్తదానం, దుస్తులు, దుప్పట్ల పంపిణీ ● కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
అభయగిరిలో అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేస్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి
డాన్ బోస్కో అనాథ శరణాలయంలో చిన్నారులకు భోజన బాక్స్‌లు
అందజేస్తున్న వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
కర్నూలు (టౌన్): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం జిల్లాలో పండుగలా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కర్నూలు నగరంలో పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డితో పాటు నేతలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక వైఎస్సార్ సర్కిల్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేశారు. అలాగే నగర శివారులోని అభయగిరి అనాథ ఆశ్రమంలో కేక్ కట్ చేసి అనాథ పిల్లలకు దుస్తులు, వృద్ధులకు స్వెట్టర్లను పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, పార్టీ నాయకులు కిషన్ అందజేశారు. అలాగే కర్నూలు నగరంలోని బిర్లా గడ్డ సమీపంలోని దండి కూడలిలో అడ్డా కూలీల మధ్య జగనన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో కేక్ కట్ చేసి కూలీలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.
● పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జననేత జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున జరిగాయి. కల్లూరులోని ఆయన నివాసానికి ఉదయమే భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. వారి సమక్షంలో కాటసాని కేక్ కట్ చేశారు. కర్నూలు నగరంలో కార్పొరేటర్ విక్రమ్‌సింహారెడ్డి ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్లకు కాటసాని దుస్తులు పంపిణీ చేశారు. అక్షయ ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ అధ్యక్షుడు నాగార్జున ఆధ్వర్యంలో డాన్ బోస్కో అనా థ శరణాలయంలో చిన్నా రులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మా జీ ఎమ్యెల్యే కాటసాని చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి వారికి తినిపించారు.
● నియోజకవర్గ కేంద్రం ఆలూరులో పార్టీ నాయకులు కార్యకర్తలు, భారీగా తరలివచ్చి గుంతకల్లు చెక్‌పోస్టు నుంచి అంబేడ్కర్ సర్కిల్ మీదుగా మహానేత వైఎస్సార్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే విరూపాక్షి ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు,బ్రెడ్డు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు శశికళ, జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షుడు రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.
● మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి తన స్వగృహంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేశారు.
● కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని కర్నూలు అర్బన్‌లో 40వ వార్డులో స్టాండింగ్ కమిటీ సభ్యులు విక్రమ సింహారెడ్డి నేతృత్వంలో జగనన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేశారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, మేయర్ బీవై రామయ్య, కోడుమూరు పార్టీ ఇన్‌చార్జ్ ఆదిమూలపు సతీష్, కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్థన్ రెడ్డి పాల్గొన్నారు.
● వెల్దుర్తి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి నాయకత్వంలో జగనన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు బ్రెడ్డు, జ్యూస్ డబ్బాలు పంపిణీ చేశారు.
● ఆదోని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ కేక్ కట్ చేశారు. అలాగే 30 మంది జగనన్న అభిమానులు రక్తదానం చేశారు. ఆస్పరి రోడ్డులోని జీవనజ్యోతి అనాథ ఆశ్రమంలో అనాథలకు అన్నదానం చేశారు.
ఎమ్మిగనూరు వైఎస్సార్ సర్కిల్ సమీపంలో వైస్ చైర్మన్ నజీర్‌అహమ్మద్ నిర్వహణలో కేక్‌కట్ చేసి విద్యార్థులకు పంచి పెట్టారు. బుట్టా ఫౌండేషన్ నిర్వహించిన రక్తదాన శిబిరంలో 61 మందికి పైగా అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఆస్పత్రికి 200ల కుర్చీలు, రోగుల కోసం దుప్పట్లను ఆస్పత్రి వైద్యులు డాక్టర్ బాలాజీ కుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి, నాయకులు బుట్టా శివనీలకంఠ, పార్టీ రాష్ట్ర వీరశైవ లింగాయత్ అధ్యక్షుడు రుద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment