ఈవీఎం గోదాము పరిశీలన
కర్నూలు(సెంట్రల్):త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎంలను భద్రపరచిన గోదామును కలెక్ట ర్ పి.రంజిత్‌బాషా పరిశీలించారు. శనివారం ఉద యం ఆయన రాజకీయ పార్టీ ప్రతినిధుల సమ క్షంలో గోదాములను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. సీసీ కెమెరాలు నిత్యం పనిచేసేలా చూసుకోవాలని, భద్రతపరంగా కట్టుదిట్టం చేయాలని, గోదాములోని అంతర్గత విభాగాలకు పెద్ద తాళాలు వేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ఎన్నికల విభాగం డీటీ మురళీ, వైఎస్సార్‌సీపీ ప్రతినిధి కె.పుల్లారెడ్డి, బీజేపీ ప్రతినిధి సాయిప్రదీప్, కాంగ్రెస్ నుంచి షేక్ ఇజాజ్ అహ్మద్, బీఎస్పీ నుంచి అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
డీవీఎంసీ సభ్యుల నియామకానికి దరఖాస్తు చేసుకోండి
కర్నూలు(అర్బన్): జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ పీఓఏ యాక్ట్‌కు సంబంధించి సభ్యుల నియామకాలకు అర్హులైన వారు జనవరి 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కే తులసీ దేవి కోరారు. ఐదుగురు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారితో పాటు ఇతర కులాలకు చెందిన ముగ్గురు ఎన్‌జీఓలను తీసుకోవడం జరుగుతుందని ఆమె శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కమిటీ పదవీ కాలం రెండేళ్లు ఉంటుందని, రెండు పర్యా యాలు కమిటీ సభ్యులుగా కొనసాగిన వారు తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులన్నారు.
నూతన డీఎంహెచ్‌వోగా డాక్టర్ శాంతికళ
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి(డీఎంహెచ్‌వో)గా డాక్టర్ శాంతికళను నియమిస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు జీవో జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డీఎంహెచ్‌వోలను వారి విన్నపం మేరకు ఇతర ప్రాంతాలకు, మరికొందరిని డిప్యూటీ సివిల్ సర్జన్‌ల నుంచి సివిల్‌సర్జన్‌లుగా పదోన్నతి కల్పించి ఆయా జిల్లాలకు పోస్టింగ్ ఇచ్చారు. ఇందులో భాగంగా వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో డిప్యూటీ డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్న ఆమెకు పదోన్నతి కల్పించి కర్నూలుకు బదిలీ చేశారు. ఇప్పటి వరకు మూడు నెలలుగా జిల్లా క్షయ నియంత్రణాధికారిగా పనిచేస్తున్న డాక్టర్ ఎల్.భాస్కర్ ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌వోగా వ్యవహరిస్తున్నారు. అలాగే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఎంవోగా పనిచేస్తున్న డాక్టర్ హేమనళినికి స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ సీఎస్‌ఆర్‌ఎంవోగా నియమించారు. కర్నూలు జిల్లా బదినేహాలు పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ టీవీ బాలమురళీకృష్ణను శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, బి.క్యాంపులోని డిస్పెన్సరీలో పనిచేస్తున్న డాక్టర్ సీహెచ్. రామకృష్ణను అనంతపురం జీజీహెచ్ సీఎస్‌ఆర్‌ఎంవోగా పోస్టింగ్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment