కర్నూలు(అగ్రికల్చర్): బ్యాంకుల నుంచి పంట రుణాలు పొంది... గడువులోపు చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ లభిస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. 2024–25 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని ఆమె శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకుల నుంచి రూ.లక్షలోపు పంట రుణం తీసుకొని గడువులోపు చెల్లిస్తే 4 శాతం వడ్డీ రాయితీ లభిస్తుందని తెలిపారు. పంట రుణాలపై 7 శాతం వడ్డీ ఉంటుందన్నారు. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పంట రుణం తీసుకొని గడువులోపు చెల్లిస్తే కేంద్రం 3 శాతం ఇంటెన్సివ్ ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క శాతం రాయితీ ఇస్తుందని తెలిపారు. 2022–23 రబీలో పంట రుణం పొంది గడువులోపు చెల్లించిన రైతులకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment