సాంకేతిక విద్యలో విద్యార్థులను తీర్చిదిద్దండి
● డీఈఓ శామ్యూల్‌పాల్
వెల్దుర్తి(కృష్ణగిరి): ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను సాంతిక విద్యలో తీర్చిదిద్దాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్‌పాల్ ఉపాధ్యాయులకు సూచించారు. వెల్దుర్తి జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని శనివారం ఆయన తనిఖీ చేశారు. ముందుగా బాలుర హైస్కూల్‌లోని పాల్ ల్యాబ్(పర్పనలైజ్ అడాప్టివ్ ల్యాబ్)ను పరిశీలించి విద్యార్థులకు అందించే బోధనపై ఆరా తీశారు. ల్యాబ్ రూం శుభ్రంగా లేకపోవడం, వెలుతురు సక్రమంగా లేకపోవడం, ప్రశ్నలకు విద్యార్థులు సరైన సమాధానలు చెప్పలేకపోవడంతో డీఈఓ అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద వెల్దుర్తి బాలుర హైస్కూల్‌ను ఎంపిక చేసి 30 ట్యాబ్‌లు అందజేశామన్నారు. జిల్లాలో మరో 50 స్కూళ్లలో టెక్నాలజీ విద్య అమలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. అయితే పాల్ ట్యాబ్ బోధన విద్యార్థులకు అందించడంలో రాష్ట్రంలో కర్నూలు జిల్లా చివరి స్థానంలో ఉండటం బాధాకరమన్నారు. పాఠశాల నిర్వహణ సక్రమంగా లేదని హెచ్‌ఎంను మందలించారు. విద్యార్థులకు పాల్ ట్యాబ్ విద్య అందించడంలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇలాగే కొనసాగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మధ్యాహ్నం భోజనం కట్టెల పొయ్యిపై చేయడం ఏమిటని ప్రశ్నించారు. గ్యాస్ పొయ్యిపై మాత్రమే చేయాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినుల సామర్థ్యాలను పరీక్షించారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ శాకీరాబేగంకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment