పెద్దాసుపత్రిలో యూరిన్ టెస్ట్ మిషన్ ఏర్పాటు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని యురాలజీ ఓపీ విభాగంలో మూత్ర ప్రవాహ పరీక్ష(యూరిన్ టెస్ట్ మిషన్) ఏర్పాటు చేశారు. శనివారం దీనిని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సీతారామయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోగుల మూత్ర సంబంధిత సమస్య ఉన్నప్పుడు తేలికగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరిన్ టెస్ట్ చేయడానికి ఈ మిషన్ ఉపయోగపడుతుందన్నారు. రూ.1.50 లక్షల విలువైన మిషన్‌ను నంద్యాలకు చెందిన డాక్టర్ లక్ష్మీసౌజన్య విరాళంగా అందజేశారన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శివబాలనాగాంజన్, డాక్టర్ కిరణ్‌కుమార్, యురాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ముత్యశ్రీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బాలరవితేజ, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ వెంకటమహేష్, డాక్టర్ అరుణ్‌కుమార్, పీజీలు డాక్టర్ హిమజ, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ ఉమామహేశ్వర, డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ సందీప్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment