మురుగునీటి సమస్యపై త్రిసభ్య కమిటీ విచారణ
ప్యాపిలి: మండల పరిధిలోని పీఆర్ పల్లిలో డీపీఓ జమీఉల్లా, ఆర్డీఓ నరసింహులు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మనోహర్ శనివారం విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన రైతు పద్మభూషణ్ రెడ్డి తన పొలంలోకి మురుగునీరు వస్తున్నట్లు ఇటీవల జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జిల్లా కలెక్టర్ గణియా రాజకుమారి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి గ్రామంలో విచారణ చేపట్టి నివేదిక పంపాలని ఆదేశించారు. ఈ మేరకు గ్రామానికి చేరుకున్న అధికార బృందం విచారణ చేపట్టారు. రైతు పొలంలోకి వస్తున్న మురుగునీటిని మరో ప్రాంతం ద్వారా మళ్లించడానికి గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశా రు. ప్రత్యామ్నాయంగా మురుగు కాలువ నిర్మాణం అత్యంత ఖర్చుతో కూడుకున్నట్లు అధికారులు గుర్తించారు. నివేదిక కలెక్టర్‌కు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఈఓఆర్డీ బాలకృష్ణుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment